AUSvsENG 4th Test : ఉత్కంఠ పోరులో నాలుగో టెస్ట్ డ్రా

3-0 తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా

AUS vs ENG 4th Test  :  ఇది ఊహించ‌ని ప‌రిణామం. పాట్ క‌మిన్స్ సార‌థ్యంలోని ఆస్ట్రేలియా జ‌ట్టు(AUS vs ENG 4th Test ) అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసేందుకు కొద్ది దూరంలో ఆగి పోయింది. యాషెస్ సీరీస్ లో భాగంగా నాలుగో టెస్టులో భారీ టార్గెట్ ముందుంచింది ఇంగ్లండ్ పై.

కానీ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ తో క‌ట్ట‌డి చేసింది. ఈ స‌మ‌యంలో గెలిచేందుకు చేసిన ప్ర‌య‌త్నం నెర‌వేర లేదు. క‌మిన్స్ డెసిష‌న్ దెబ్బ‌కు ఆసిస్ పై చేయి సాధించినా ఆఖ‌రి వికెట్ ను తీయ‌లేక పోయింది.

ఆసిస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు. ఇప్ప‌టి దాకా స్టార్ బ్యాట‌ర్ గా పేరొందిన స్మిత్ అడ‌పా ద‌డ‌పా బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. 2016 త‌ర్వాత మ‌ళ్లీ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు.

నాలుగో టెస్టు ఆఖ‌రి రోజున జాక్ లీచ్ వికెట్ ను సాధించినా ఫ‌లితం లేక పోయింది. మ‌రో మూడు ఓవ‌ర్లు ఉండ‌గానే ఆసిస్ గెలుపు వాకిట వ‌చ్చి నిలిచి పోయింది.

ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 268 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 99వ ఓవ‌ర్ త‌ర్వాత బ్యాడ్ లైట్ కార‌ణంగా పేస్ బౌల‌ర్ల‌కు బ‌దులు స్పిన్న‌ర్ల‌ను ఉప‌యోగించాల‌ని అంపైర్లు కెప్టెన్ క‌మిన్స్ కు సూచించారు.

ఆ స‌మ‌యంలో స్టివ్ స్మిత్ కు బంతిని ఇచ్చాడు. 100 ఓవ‌ర్ లో స్మిత్ అద్భుతం చేశాడు. ఓ వికెట్ తీశాడు. కానీ ఇంకో వికెట్ తీయ‌లేక పోవ‌డంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నాలుగో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. ఇదిలా ఉండ‌గా ఇంకో టెస్టు ఆడాల్సి ఉంది ఇరు జ‌ట్లు.

Also Read : రాహుల్ కంటే ర‌హానే బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!