AP High Court : ఏపీ హైకోర్టు చింతామణి నాటకాన్ని నిషేధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఒక పాత్ర వల్ల ఇబ్బంది కలుగుతుందని మొత్తం నాటకానికి మంగళం పాడాలని అనుకుంటే ఎలా అని సీరియస్ అయ్యింది.
ఒక వేళ ఆ పాత్ర వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బ తింటాయని అనుకుంటే దానిని తొలగించాలి కానీ సుదీర్ఘ కాలం పాటు ప్రదర్శిస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వస్తున్న చింతామణి నాటకాన్ని నిలిపి వేయడం మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది.
ఇది పూర్తిగా భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు భావించాల్సి వస్తుందని పేర్కొంది. దీనిపై నిషేధం విధించాలని ఎందుకు అనుకున్నారంటూ నిలదీసింది. చింతామణి పుస్తకాన్ని ఏమైనా బంద్ చేశారా అని ప్రశ్నించింది.
ఈ సందర్భంగా పుస్తకాన్ని నిషేధించ లేదని చెప్పారు న్యాయవాదులు. మరి పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారంటూ ఎదురు ప్రశ్న వేసింది హైకోర్టు(AP High Court). ఆర్య వైశ్యులు ఇచ్చిన వినతి పత్రాన్ని తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
దీనికి సంబంధించి ఏపీ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా వందేళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది చింతామణి నాటకానికి. దీనిని నమ్ముకుని వేలాది మంది కళాకారులు బతుకుతున్నారు.
దీనినే జీవనోపాధిగా చేసుకుని ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులు కళాకారుడు త్రినాథ్ దావా దాఖలు చేశారు. దీనీపై కోర్టు విచారణ చేపట్టింది.
కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Also Read : ఆధ్యాత్మిక సౌరభం సమతా కేంద్రం