Hijab Row HC : హిజాబ్ ఇస్లాంలో అంత‌ర్భాగం కాదు

క‌ర్ణాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

Hijab Row HC :దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన క‌ర్ణాట‌క హిజాబ్ వివాదంపై తీర్పు వెలువరించింది హైకోర్టు. ముగ్గురు న్యాయ‌మూర్తులతో కూడిన ధ‌ర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు 200 పేజీల‌తో కూడిన తీర్పు వెలువ‌రించింది.

ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. హిజాబ్ (Hijab Row HC)అన్న‌ది ఇస్లాం మతంలో అంత‌ర్భాగం కాద‌ని స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పింది.

ఉడిపి, శివ‌మొగ్గ‌లోని కాలేజీలలో విద్యార్థులకు ప్ర‌వేశం నిరాక‌రించ‌డంతో వివాదం రాజుకుంది. ఇదిలా ఉండ‌గా ఇస్లాం ప్ర‌కారం హిజాబ్ ధ‌రించ‌డం(Hijab Row HC) మ‌త ప‌ర‌మైన ఆచార‌మ‌ని, అందుకే హిజాబ్ ధ‌రించేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని బాధితుల త‌ర‌పున దాఖ‌లైన పిటిష‌న్ల త‌ర‌పున న్యాయ‌వాది వాదించారు.

ఇది త‌మ ప్రాథ‌మిక హ‌క్కు అని, దానిని కాదనే హ‌క్కు ప్ర‌భుత్వానికి లేదంటూ కొంద‌రు ముస్లింలు పేర్కొన్నారు. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది హైకోర్టు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని స్ప‌ష్టం చేసింది.

విద్యా సంస్థ‌ల‌లో చ‌దువుకునే వాళ్లు రూల్స్ పాటించాల్సిందేన‌ని తీర్పు చెప్పింది. ఇందులో ఎవ‌రికీ మిన‌హాయింపులు ఉండ‌వ‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం.

ముస్లిం మ‌హిళ‌లు హిజాబ్ ధ‌రించ‌డం ఇస్లామిక్ విశ్వాసంలో అవ‌స‌ర‌మైన మ‌త ప‌ర‌మైన ఆచారంలో భాగం కాద‌ని తాము భావిస్తున్నామంటూ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రితూ రాజ్ అవ‌స్తీ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

మూడు ప్ర‌శ్న‌ల‌కు స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇచ్చింది కోర్టు. హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాదు. పాఠ‌శాల లేదా క‌ళాశాల లేదా విద్యా సంస్థ‌ల‌లో అంతిమ నిర్ణ‌యం సంస్థ‌లదేన‌ని పేర్కొంది. ఉత్త‌ర్వులు జారీ చేసే అధికారం ప్ర‌భుత్వానికి ఉంద‌ని తెలిపింది.

Also Read : హిజాబ్ ధ‌రించ‌డం త‌ప్పనిస‌రి కాదు

Leave A Reply

Your Email Id will not be published!