John Williams : ద్రవ్య విధానంపై డిజిటల్ కరెన్సీ ప్రభావం
న్యూయార్క్ ఫెడ్ ప్రెసిడెంట్ జాన్ విలియమ్స్
John Williams : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు డిజిటల్ జపం వినిపిస్తోంది. ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ గురించే చర్చ జరుగుతోంది. ఇక ప్రపంచ మార్కెట్ ను శాసిస్తున్న అమెరికా ఏం చేయబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొన్న తరుణలో న్యూయార్క్ ఫెడ్ ప్రెసిడెంట్ జాన్ విలియమ్స్(John Williams) సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుత ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. డిజిటల్ కరెన్సీ ప్రభావం ద్రవ్య విధాన సూత్రీకరణపై తప్పకుండా ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాడు.
ఇందులో భాగంగా డిజిటల్ కరెన్సీ, చెల్లింపుల సాంకేతికతలను డెవలప్ చేయడం వల్ల ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని, దాని బ్యాలెన్స్ షీట్ కూర్పును ఎలా మారుస్తుందో అర్థం చేసుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ పని చేయాల్సి ఉంటుందన్నాడు విలియమ్స్.
కొలంబియా విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మానిటరీ పాలసీ అమలు కోసం సెంట్రల్ బ్యాంకులు ఎలా అంచనా వేస్తాయి, అవి ఎలా మేలు చేకూరుస్తాయంటూ ప్రశ్నించారు జాన్ విలియమ్స్(John Williams).
కేంద్ర బ్యాంకుల పాత్ర ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను రక్షించడం. అంతే కాకుండా ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకు రావడానికి ఎల్లప్పుడూ డబ్బులు, లిక్విడిటిని సరఫరా చేయాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరి ఫెడ్ డిజిటల్ డాలర్లను సృష్టిస్తుందా లేక ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచిస్తుందో వేచి చూడాలి. డిజిటల్ కరెన్సీ పై ఇంకా ఓ క్లారిటీకి రాలేక పోతున్నాయి ప్రపంచంలోని దేశాలు. ఎవరు నియంత్రిస్తారనేది ఒక అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
Also Read : ఫేస్ బుక్ కు షరిల్ శాండ్ బర్గ్ గుడ్ బై