IPL : ప్రపంచ క్రికెట్ ను ఒక రకంగా శాసించే స్థాయికి చేరుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ. అత్యధిక నికర ఆదాయం కలిగిన ఏకైక క్రీడా సంస్థ. ఈ దేశంలో బీసీసీఐకి ఉన్నంత పవర్ ఇంకే దానికీ లేదు.
ఆ సంస్థ ఎవరినీ లెక్క చేయదు. అందులో ఎవరూ వేలు పెట్టేందుకు వీలు లేదు.
ఇక బీసీసీఐకి చీఫ్ గా సౌరవ్ గంగూలీ వచ్చాక మార్పులు చోటు చేసుకున్నాయి. కొంత పారదర్శకత అన్నది వచ్చేలా చేశాడు.
ఇందులో అనుమానం అక్కర్లేదు. కానీ సుదీర్ఘ కాలం పాటు నిలకడగా విజయాలు సాధిస్తూ వస్తున్న భారత జట్టు గత కొంత కాలంగా పడుతూ లేస్తూ వస్తోంది.
ఇందుకు ప్రధాన కారణం ఇండియన్ ప్రిమీయర్ లీగ్(IPL) అన్న ఆరోపణలు ఉన్నాయి.
పొద్దస్త మానం కొన్ని రోజుల పాటు టీ20, వన్డే, టెస్టు మ్యాచ్ లు ఆడడం కంటే జస్ట్ కొన్ని రోజుల్లోనే
ఫలితం పూర్తయ్యే ఐపీఎల్ రిచ్ లీగ్ అయితే బెటర్ అన్న స్థాయికి వచ్చేశారు మన ఆటగాళ్లు.
ఇతర జట్లు తప్పనిసరిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ వస్తున్నాయి. అక్కడి ఆటగాళ్ల ప్రయారిటీ మ్యాచ్ లే కానీ ఐపీఎల్ కాదు.
కానీ ఇండియా వరకు వచ్చే సరికల్లా మనోళ్లకు మ్యాచ్ ల కంటే కోట్లు కురిపించే ఐపీఎల్(IPL) కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.
దీంతో అసలైన ఆట తీరు ను ప్రదర్శించ లేక పోతున్నారు. రాను రాను సంప్రదాయ ఆట తీరును ప్రదర్శించకుండానే వచ్చీ రావడంతోనే ఫోర్లు లేదా సిక్సర్లు కొట్టడం లేదంటే అవుట్ అయి పోవడం చేస్తూ వస్తున్నారు.
దీంతో అసలైన ఆటగాళ్లకు స్కోప్ లేకుండా పోతోంది. ఇప్పటికైనా బీసీసీఐ సంప్రదాయ ఆట ఆడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
లేకపోతే ఆటగాళ్ల మాటేమిటో కానీ అసలైన ఆట కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. కాసులు కురిపించే ఐపీఎల్ కంటే దేశం పరువు ముఖ్యమన్నది గ్రహించాలి.
Also Read : మెతక వైఖరి కొంప ముంచిందా