Lab Dab Dabboo : అంత‌టా ‘ల‌బ్ డ‌బ్’ సాంగ్ సంద‌డి

ఎఫ్3 సాంగ్ కు భారీ రెస్పాన్స్

Lab Dab Dabboo : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరొందిన అనిల్ రావిపూడి మ‌రోసారి త‌న మార్క్ చూపించేందుకు రెడీ అయ్యాడు. తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎఫ్2 మూవీ క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది.

దిల్ రాజు నిర్మాణంలో రూపు దిద్దుకున్న ఈ మూవీలో విక్ట‌రీ వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా భాటియా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

ఇక అంతేగా అంతేగా అంటూ న‌వ్వించిన ప్ర‌గ‌తి, ప్ర‌దీప్ , రాజేంద్ర ప్ర‌సాద్ ఇలా ప్ర‌తి ఒక్క‌రు త‌మ న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేశారు. భారీ స‌క్సెస్ సాధించ‌డంతో ఎఫ్ -2 మూవీకి సీక్వెల్ గా ఎఫ్ -3ని రూపొందించారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.

క‌రోనా కార‌ణంగా సంక్రాంతికి విడుద‌ల కావాల్సి ఉండ‌గా ఈ మూవీని వాయిదా వేశారు. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎఫ్‌2 లో భార్య భ‌ర్త ల మ‌ధ్య ఉన్న చిన్న‌పాటి స‌మ‌స్య‌ల‌ను జోవియ‌ల్ గా తెర‌కెక్కించాడు రావిపూడి.

సీక్వెల్ మూవీలో ప్ర‌ధానంగా మ‌నీ ప్రాధాన్య‌త గురించి తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. తాజాగా సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. పైసా ఉంటే ప్ర‌పంచ‌మే పిల్లి..ల‌బ్ డ‌బ్ పాట‌కు (Lab Dab Dabboo)అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.

మోస్ట్ వెయిటింగ్ ఫ‌న్ ఫిల్డ్ ఎంట‌ర్ టైన‌ర్ ఎఫ్ -3తో మూడు రెట్ల‌కు పైగా వినోదాన్ని అందించేలా ట్రై చేస్తున్నారు ద‌ర్శ‌కుడు. ఇక ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ ల‌బ్ డ‌బ్ ల‌వ్ డ్ డ‌బ్బును విడుద‌ల చేశారు. పైసా ఉంటే ప్ర‌పంచ‌మే పిల్లి అవుతుందంటూ ఇందులో ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ అందిస్తున్నారు. రామ్ మిర్యాల పాడితే భాస్క‌ర‌భ‌ట్ల దీనిని రాశారు.

Also Read : దీపిక‌తో రొమాన్స్ చెప్ప‌లేని ఫీలింగ్

Leave A Reply

Your Email Id will not be published!