Tejasvi Surya : ఓటు వేసిన ఎంపీ తేజ‌స్వి సూర్య

క‌న్న‌డ కొన‌సాగుతున్న పోలింగ్

Tejasvi Surya : క‌ర్ణాట‌క‌లో పోలింగ్ కొన‌సాగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్ల‌కు ఇవాళ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. త‌మ విలువైన ఓటును వినియోగించుకునేందుకు ఓట‌ర్లు బారులు తీరారు. సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై, మాజీ సీఎంలు సిద్ద‌రామ‌య్య‌, జ‌గ‌దీశ్ షెట్ల‌ర్ , కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు త‌మ విలువైన ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

బుధ‌వారం త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు, యూత్ ఐకాన్ గా పేరు పొందిన తేజ‌స్వి సూర్య‌(Tejasvi Surya). ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌నుల జ‌ర‌గ‌కుండా పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,545 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.

ఇక రాష్ట్రంలో 224 అసెంబ్లీ సీట్ల‌కు గాను 2,615 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. మొత్తం 42,48,028 కొత్త ఓట‌ర్లు ఓటు వేసేందుకు న‌మోదు చేసుకున్నారు.రాష్ట్రంలో 5.3 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఈ విష‌యాన్ని భార‌త ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. ఇందులో 11,71,558 మంది యువ ఓట‌ర్లు కాగా 12,15,920 మంది సీనియ‌ర్ సిటిజ‌న్ ఓట‌ర్లు ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా ఈసారి ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతున్నాయి. అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ న‌డుస్తోంది. మ‌ధ్య‌లో జేడీఎస్ ఉన్నా మొత్తంగా ఈసారి పోటీ మాత్రం బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ గా మారి పోయింద‌న్న ప్ర‌చారం జోరందుకుంది.

Also Read : క‌న్న‌డ నాట 145 సీట్లు ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!