People Power : ప్రజలే ప్రభువులు పాలకులు సేవకులు
గుర్తిస్తే మంచిది లేక పోతే తలవంచక తప్పదు
People Power : పాలకులు సేవకులు మాత్రమే. కానీ తామే అధికారం అని విర్రవీగితే మిగిలేది విషాదమే. కారే రాజులు గర్వోన్నతి పొందరే అని కవిరేణ్యుడు రాసింది అక్షరాల వాస్తవం.
ప్రపంచాన్ని జయించిన ఆనందంతో విర్రవీగిన హిట్లర్ చివరకు తాను సామాన్యుడినంటూ గుర్తించాడు. చరిత్రలో ఎందరో రాజులు ఉన్నారు.
మరెందరో పాలకులు తమదైన ముద్ర వేశారు.
కానీ కొందరు మాత్రమే పాలకులుగా గుర్తుంచుకునేలా చేశారు. ప్రజల కోసం పని చేసిన వారికి మాత్రమే గుర్తింపు ఉంటుంది. ప్రజల్ని
ఓటు బ్యాంకుగా, నోట్లు కుమ్మరిస్తే చాలు పవర్ లోకి వస్తామని అనుకుంటన్న వారు తమ జీవితం కొద్ది సేపేనని గుర్తుంచు కోవాలి.
జనాన్ని నిత్యం ప్రేమించిన వాళ్లను ప్రజలు(People Power) తమ గుండెల్లో పదిలంగా దాచుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రజల కోసం పాలకులే కాదు ఇతర రంగాలకు చెందిన వారు సేవలు అందించిన వారిని తలుచు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇవాళ జపాన్ దేశానికి చెందిన మాజీ ప్రధాన మంత్రి షింజో అబే కాల్పులకు గురయ్యాడు. ఎందుకంటే శాంతిని కోరుకునే వాళ్లను చూస్తే హింసావాదులకు రుచించదు. అందుకే కాల్పులకు తెగబడ్డారు.
యావత్ ప్రపంచం అతడిని స్మరించు కుంటోంది. తన దేశాన్ని అన్ని రంగాలలో బలవంతమైన దేశంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేశాడు.
తనకు ఎదురే లేదని విర్రవీగుతున్న చైనాకు చుక్కలు చూపించాడు.
మరో వైపు యావత్ ప్రపంచం వద్దని వారించినా వినిపించు కోకుండా యుద్ద, రాజ్య కాంక్షతో విర్రవీగుతున్న రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్
కూడా ఈ భూమి మీదే ఉన్నారు. కానీ ఇద్దరూ వేర్వేరు.
ఇక్కడే పాలకులు తెలుసు కోవాల్సింది. గుర్తించాల్సింది ఒక్కటే తాము సేవకులమని అనుకుంటేనే ప్రజలకు సేవ చేయగలరు. లేక పోతే శ్రీలంకలో చోటు చేసుకున్న పరిస్థితిని ఎదుర్కోకక తప్పదు.
కోట్లాది రూపాయలను అక్రమంగా వెనకేసుకుని స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న వాళ్లు, ప్రభుత్వ బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకున్న
వాళ్లకు కనువిప్పు కావాలి.
దేశం , ప్రజలు శాశ్వతం పాలకులు అశాశ్వతం. ఇకనైనా పాలకులు మారాలి. లేకపోతే తస్మాత్ జాగ్రత్త.
Also Read : ముదిరిన సంక్షోభం పెల్లుబికిన ప్రజాగ్రహం