Channi : రాజ‌కీయ రాద్ధాంతం ‘చ‌న్నీ’ ఆగ్ర‌హం

హ‌మ్మ‌య్య ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డా

Channi : ఊహించ‌ని ప‌రిణామాన్ని ఎదుర్కొన్నారు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తీవ్ర నిర‌స‌న ఎదుర్కొన్నారు.

రోడ్డు మార్గం ద్వారా వెళుతున్న ప్రధాని కాన్వాయ్ ను 20 నిమిషాల పాటు నిర‌స‌న‌కారులు అడ్డుకున్నారు.

దీంతో త‌న ప‌ర్య‌ట‌న‌ను అర్ధాంత‌రంగా వ‌దిలేసి ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణం అయ్యారు.

ఒక దేశ ప్ర‌ధాన మంత్రికి ఇలాంటి అవ‌మానం జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

దీనిని భ‌ద్ర‌తా వైఫ‌ల్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ తో పాటు కేంద్ర మంత్రులు మండి ప‌డుతున్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం పంజాబ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ(Channi)దేనంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు.

వారు చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ త‌ప్పేనంటూ, అత్యంత స‌త్య దూర‌మ‌ని, నిరాధార‌మైన‌వంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం చ‌న్నీ. ఈ మేర‌కు ఆయ‌న పీఎం ను త‌ప్పు ప‌ట్టారు.

ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో దీనిని రాజ‌కీయంగా వాడుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు.

కాగా సెక్యూరిటీ లోపం కార‌ణంగా 20 నిమిషాల‌కు పైగా రోడ్డుపైనే నిలిచి పోయింది ప్ర‌ధాని కాన్వాయ్.

కేంద్ర హోం శాఖ సీరియ‌స్ అయ్యింది ఈ వ్య‌వ‌హారంపై. ఎవ‌రైతే పాల్గొన్నారో వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు అమిత్ షా.

ఇదిలా ఉండ‌గా మోదీ నిర్వ‌హించే ర్యాలీకి జ‌నం రాక పోవ‌డంతో వెళ్లి పోయారంటోంది కాంగ్రెస్.

ఇదిలా ఉండ‌గా హోం శాఖ క‌థ‌నం వేరేలా ఉంది. సీఎం చ‌న్నీ చెప్పింది మ‌రోలా ఉంది.

వాతావ‌ర‌ణం బాగా లేక పోవ‌డంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల‌ని నిర్ణ‌యించారు మోదీ.

పైరియాణా గ్రామ స‌మీప ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద‌కు చేరుకునే స‌రికి అక్క‌డ కొంద‌రు నిర‌స‌న కారులు అడ్డ‌గించారు.

దీంతో ఆగి పోయింది పీఎం కాన్వాయ్. 200 మంది రైతులు అక‌స్మాత్తుగా వ‌చ్చార‌ని పంజాబ్ డీఐజీ ఇంద‌ర్ బీర్ సింగ్ వెల్ల‌డించారు.

అయితే పీఎం టూర్ లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, సీఎం, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌రు కావాల్సి ఉండ‌గా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

మొత్తంగా సేఫ్ గా చేరుకున్నానంటూ థ్యాంక్స్ సీఎం చ‌న్నీ(Channi) అంటూ పేర్కొన్నారు మోదీ. పంజాబీలు త‌మ అథితుల కోసం ప్రాణాలు ఇస్తారు త‌ప్ప తీయ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా మోదీ టూర్ ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను లేవ‌దీసింది.

Also Read : మాన‌వ‌తామూర్తి ‘అక్ష‌ర స్ఫూర్తి విద్యా దీప్తి’

Leave A Reply

Your Email Id will not be published!