XI Jin Ping : చైనా ప‌గ్గాలు మ‌రోసారి జిన్ పింగ్ కే

ముగిసిన క‌మ్యూనిస్ట్ పార్టీ మీటింగ్

XI Jin Ping : అనుమానాలు పటాపంచ‌లు చేస్తూ మ‌రోసారి డ్రాగ‌న్ చైనా దేశానికి అధ్య‌క్షుడు కానున్నారు జిన్ పింగ్. ఆయ‌నను నిర్బంధించార‌ని, బ‌య‌ట‌కు రాలేరంటూ పెద్ద ఎత్తున ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌చారం జ‌రిగింది. అవ‌న్నీ పుకార్లు అంటూ బ‌య‌ట‌కు వ‌చ్చారు జిన్ పింగ్. ఆయ‌న చైనా చీఫ్ గా కొలువు తీరాక సీన్ మారింది.

అమెరికా లాంటి దిగ్గ‌జ దేశాన్ని భ‌య‌పెట్టే స్థాయికి తీసుకు వెళ్లారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ మార్కెట్ ను చైనా శాసిస్తోంది. ఈ త‌రుణంలో శ‌నివారం కీల‌క‌మైన క‌మ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ జ‌రిగింది. ఇందులో జిన్ పింగ్ పార్టీకి చీఫ్ తో పాటు చైనాకు ఆయ‌నే అధ్య‌క్షుడిగా ఉండాల‌ని స‌భ్యులు తీర్మానించిన‌ట్లు స‌మాచారం.

ఇక మావో జెడాంగ్ త‌ర్వాత చైనా కు అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుడిగా జిన్ పింగ్ త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ మేర‌కు గ్రౌండ్ కూడా సిద్దం చేశారు. రాజ‌కీయ విశ్లేష‌కుల ప్ర‌కారం జిన్ పింగ్(XI Jin Ping) మూడవసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మంటున్నారు. డేర్ టు స్ట్ర‌గుల్ డేర్ టు విన్ మెసేజ్ తో ఆయ‌న వెలుగులోకి వ‌చ్చారు.

అత్యంత శ‌క్తివంత‌మైన దేశంగా చైనాను మార్చేశారు. ఇప్పుడు అమెరికాతో పాటు ఢీకొనే స్థాయికి తీసుకు వ‌చ్చారు. సైనిక ప‌రంగా, ఆయుధాల ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు బ‌లోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకు వెళ్ల‌డంలో జిన్ పింగ్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా జిన్ పింగ్ ఆదివారం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నిక కావ‌డం ఖాయ‌మంటున్నారు.

Also Read : బ్రిట‌న్ పీఎం రేసులో రిషి సున‌క్ ..పెన్నీ

Leave A Reply

Your Email Id will not be published!