Manipur Election 2022 : మణిపూర్ లో జరిగిన రెండో విడత పోలింగ్ హింసాత్మకంగా మారింది. మొదటి విడత పోలింగ్ పూర్తయింది. దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ (Manipur Election 2022 )లో ఆరు విడతల పోలింగ్ ముగిసింది.
ఇంకా ఒక విడత పోలింగ్ మిగిలి ఉంది. రెండో దశ ఎన్నికల పోలింగ్ హింస చెలరేగింది. రాష్ట్రంలోని తౌబల్ జిల్లాలో ఓ ఘటన సెనాపతి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది.
ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్నికలు తమ పనితీరుకు ప్రజలు ఇచ్చే రెఫరెండమ్ గా తాము భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారీ ఎత్తున పోలింగ్ కొనసాగింది.
ఈ విషయాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు. ఛందేల్ , జిరిబామ్ , తౌబల్ లో ఓటు శాతం పెరిగింది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
ఇందులో 92 మంది అభ్యర్థులు తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా మొత్తం 8 లక్షల 38 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు యత్నించారు.
ఇదిలా ఉండగా గత నెల ఫిబ్రవరి 28న తొలి విడత ఎన్నికల్లో దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. చౌరచందర్ పూర్ , కాంగోష్కి, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించినట్లు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ వెల్లడించారు.
ఈనెల 10న ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆరోజు మధ్యాహ్నం వరకు పూర్తి క్లారిటీ వస్తుంది.
Also Read : 11న ఆశిష్ మిశ్రాపై సుప్రీం విచారణ