Wrestling Body Amid : రెజ్లర్ల ఆందోళన వెనుక రహస్య ఎజెండా
భారత రెజ్లర్ల సమాఖ్య కేంద్రానికి లేఖ
Wrestling Body Amid : మహిళా రెజ్లర్లు చేసిన ఆందోళనపై భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) స్పందించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మహిళా రెజ్లర్ల ఆందోళన వెనుక వ్యక్తిగత ఎజెండా ఉందని ఆరోపించింది. వీరు చేపట్టిన నిరసన వల్ల వర్ధమాన రెజ్లర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఇది ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వదని స్పష్టం చేసింది సమాఖ్య. కాగా డబ్ల్యుఎఫ్ఐ చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగింక ఆరోపణలు చేయడం వెనుక రహస్య ఎజెండా దాగి ఉందని ఆరోపించింది. ఇందుకు సంబంధించి తాము సంస్థ తరపున ఆధారాలు కూడా సమర్పిస్తామని తెలిపింది.
మహిళా రెజ్లర్లు(Wrestling Body Amid) చేపట్టిన ఈ నిరసన ఎంత మాత్రం మంచి పద్దతి కాదు. ఇది రెజ్లింగ్ ను ప్రోత్సహించదు. కానీ డబ్ల్యుఎఫ్ఐ ప్రస్తుతం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ సమయంలో ఇలాంటి చవకబారు, నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల సంస్థపై తీవ్ర ఎఫెక్టు పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపించింది. ఒక రకంగా చెప్పాలంటే అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతమైన ఎజెండా దిగా ఉందని తెలిపింది. అనవసరమైన ఒత్తిడిని సృష్టించేందుకు బహిరంగంగా ఇలాంటి ఆందోళనకు దిగారంటూ ఆరోపించింది డబ్ల్యూఎఫ్ఐ. యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.
ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా రెజ్లర్లు వినేష్ ఫోగట్ , బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ , రవి దహియా, దీపక్ పునియా ఆందోళనలో పాల్గొన్నారు.
Also Read : విచారణ పూర్తయ్యే దాకా ‘బ్రిజ్’ ఉండరు