PM Modi : ప్రాజెక్ట్ టైగర్ విజయం దేశానికి గర్వకారణం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామెంట్స్
PM Modi Project Tiger : పర్యావరణం , ఆర్థిక వ్యవస్థ మధ్య వైరుధ్యాన్ని భారత దేశం విశ్వసించదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వన్య ప్రాణుల రక్షణ అనేది సార్వత్రిక సమస్య అని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) ప్రారంభించారు.
ప్రాజెక్ట్ టైగర్ విజయాన్ని ప్రధాని మోదీ హైలెట్ చేశారు. రెండింటి మధ్య సహ జీవనానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ టైగర్(PM Modi Project Tiger) కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.
2022లో భారత దేశంలో పులుల జనాభా 3,167గా ఉందని చూపించిన డేటాను ఉటంకించారు. తాము చేరుకున్న పులుల సంఖ్య తమ కుటుంబం పెరుగుతోందని చూపిస్తోందన్నారు. ఇది గర్వించదగిన క్షణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మనం మరిన్ని సాధిస్తామని ప్రపంచానికి హామీ ఇస్తున్నానని ప్రకటించారు.
పులుల జనాభా 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226 , 2018లో 2,967, 2022లో 3,167 ఉన్నట్టు చెప్పారు ప్రధానమంత్రి. ప్రాజెక్ట్ టైగర్ విజయం భారత దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి గర్వ కారణమని అన్నారు మోదీ.
Also Read : టైగర్ ప్రాజెక్టు ఆమె పుణ్యమే