Sangakkara : స్పిన్న‌ర్ల‌తో జ‌ట్టు బ‌లంగా ఉంది

ఆర్ఆర్ డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర‌

Sangakkara : ఈనెల 26 నుంచి ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ 2022 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి జ‌రిగే 15వ సీజ‌న్ రిచ్ లీగ్ లో 10 టీంలు పాల్గొంటున్నాయి మొద‌టిసారిగా. ఇప్ప‌టికే ఆయా జ‌ట్లు ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయాయి.

ఇప్ప‌టికే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) టీం మేనేజ్ మెంట్ కొత్త జెర్సీ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ డైరెక్ట‌ర్ , దిగ్గ‌జ మాజీ క్రికెట‌ర్ కుమార సంగ‌క్క‌ర(Sangakkara) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

టోర్నీలో ఏ జ‌ట్టుకూ లేని అద్భుత‌మైన స్పిన్న‌ర్లు త‌మ‌కు ఉన్నార‌ని పేర్కొన్నాడు. ప్ర‌పంచ క్రికెట్ లో ఇద్ద‌రు టాప్ స్పిన్న‌ర్లు ఉన్నార‌ని తెలిపాడు.

లీగ్ లో భాగంగా ఈనెల 29న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals)  పూణె లోని ఎంసీఏ స్టేడియంలో ఆడ‌నుంది. 24 మంది ఆట‌గాళ్ల‌తో మెగా వేలాన్ని ముగించింది.

టీంలో స్పిన్న‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin) తో పాటు యుజువేంద్ర చాహ‌ల్ ఉండ‌గా రాస్సీ వాన్ డెర్ డ‌స్సెన్ , షిమ్రాన్ హిట్మెయిర్ (Shimran Hitmeyer) , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ బ్యాట‌ర్ ల‌లో ఉన్నారు.

నాథ‌న్ కౌల్ట‌ర్ – నైల్ , జిమ్మీ నీష‌మ్ ఆడ‌నున్నారు. జ‌ట్టు కెప్టెన్ గా సంజూ శాంస‌న్ , జోస్ బ‌ట్ల‌ర్ , య‌శ‌స్వి జైస్వాల్ లు జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం కానున్నారు.

అశ్విన్, చాహ‌ల్ ఇద్దరూ అద్భుత‌మైన స్పిన్నర్లంటూ పేర్కొన్నాడు కుమార సంగ‌క్క‌ర‌(Sangakkara). వీరిద్ద‌రూ లెగ్ స్పిన్న‌ర్ల‌లో టాప్ లో ఉన్నార‌ని తెలిపాడు.

ఈసారి జ‌రిగే రిచ్ లీగ్ లో తమ జ‌ట్టు అద్భుతంగా ఉంద‌ని పేర్కొన్నాడు సంగ‌క్క‌ర‌. ఎలాగైనా టైటిల్ గెల‌వ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశాడు.

Also Read : భ‌విష్య‌త్తులో రోహిత్ శ‌ర్మ‌దే హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!