Kohli Anushka : ప్రేమ నిజం ఆమె అద్బుతం

మైదానంలో అరుదైన దృశ్యం

Kohli Anushka  : విరాట్ కోహ్లీ భార‌తీయ క్రికెట్ లో ఓ అద్భుతం. త‌ను ఎవ‌రికీ లొంగ‌డు. భిన్న‌మైన ఆట‌గాడు. విభిన్న‌మైన ఆట తీరుతో టీమిండియాకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టిన ఘ‌నుడు.

నాయ‌కుడిగా, ప్లేయ‌ర్ గా, వ్య‌క్తిగా కోహ్లీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. ఈర్ష్యా ద్వేషాల‌కు అతీతంగా త‌న ప‌నేదో తాను చేసుకుంటూ పోయే ర‌కం. అంతే కాదు చాలా మంది ఆట‌గాళ్లు ఒక్కో ర‌కం. కానీ కోహ్లీ మాత్రం ఏ మాత్రం ఓట‌మిని ఒప్పుకోడు.

మైదానంలోకి వ‌చ్చాడంటే అడ‌విలో ఉన్న పులి జ్ఞాపకం వ‌స్తుంది. త‌ను ఆడుతూ ఇత‌రుల‌ను ప్రోత్స‌హిస్తూ వ‌స్తాడు. అందుకే అత‌డు త‌న నాయ‌క‌త్వ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్పుడు యావ‌త్ ప్ర‌పంచంలోని క్రీడాభిమానులు విస్తు పోయారు.

దాయాది పాకిస్తాన్ కు చెందిన ఆట‌గాళ్లు సైతం ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఎక్క‌డా త‌గ్గ‌ని మ‌న‌స్త‌త్వ‌మే కోహ్లీని విజేతగా నిలిచేలా చేసింది. అందుకే అత‌డు వెరీ వెరీ స్పెష‌ల్. త‌ను అనుకున్న‌ది సాధించేంత దాకా వ‌దిలి పెట్ట‌డు.

ఎవ‌రికీ తల వంచ‌ని మ‌న‌స్త‌త్వ‌మే భార‌త జ‌ట్టును మ‌రింత క‌ట్టుదిట్టంగా, ప‌టిష్ట‌వంత‌మైన టీమ్ గా మార్చేలా చేసింది. ఇవాళ కోహ్లీ 100వ టెస్టు ఆడుతున్నాడు.

బీసీసీఐతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కూడా అరుదైన జ్ఞాపిక‌ను అంద‌జేశారు. ఇదే స‌మ‌యంలో మైదానంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.

త‌ను ప్రాణ‌ప‌దంగా ప్రేమించే భార్య అనుష్క శ‌ర్మ (Kohli Anushka )కూడా హాజ‌రైంది. ఆమె క‌ళ్ళ లోకి చూస్తూ నువ్వు లేక పోతే నేను లేను అన్నంత‌గా లీన‌మ‌య్యాడు కోహ్లీ. ఇదే ప్రేమంటే. త‌ను లేక పోతే నేను లేనంటాడు కోహ్లీ.

Also Read : ఆ ఇద్ద‌రూ లేకుండానే బ‌రిలోకి

Leave A Reply

Your Email Id will not be published!