Mayawati : దేశ రాజకీయాలలో ఆమె అనూహ్యంగా ముందుకు వచ్చింది. తన సత్తా ఏమిటో చూపించింది. అంతా చిన్న చూపు చూసిన సమయంలో కుమారి మాయావతి ఉప్పెనలా ముందుకు వచ్చింది.
బహుజన్ సమాజ్ వాది పార్టీని స్థాపించిన మాన్యశ్రీ కాన్షీరామ్ వారసురాలిగా ఆమె ఏకంగా సీఎం పీఠం అధిరోహించింది. బహుజనుల స్వరంగా ఉంటూ వచ్చారు.
ఇవాళ మాయావతి పుట్టిన రోజు. 1956 జనవరి 15న ఢిల్లీలో జన్మించారు. దేశంలో మొట్ట మొదటి దళిత సీఎంగా(Mayawati )పేరొందారు.
ప్రస్తుతం బీఎస్పీ చీఫ్ గా ఉన్నారు. యూపీలోని అట్టడుగు తెగ అయిన జాతవ్ అనే కులానికి చెందింది.
2007లో అన్ని అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళా నేతల్లో ఒకరిగా మాయావతి ఎంపికయ్యారు.
అమెరికాకు చెందిన న్యూస్ వీక్ పత్రిక ఈ విషయాన్ని ప్రకటించింది.
ఆమె పేరెంట్స్ రాం రాఠి, ప్రభుదాస్. బీఇడితో పాటు లా కూడా చేశారు మాయావతి.
ఢిల్లీలో టీచర్ గా పని చేసింది. 1977లో ఐఏఎస్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న తరుణంలో మాన్యశ్రీ కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది.
1984లో బీఎస్పీని ఏర్పాటు చేశారు. ముజఫరనగర్ జిల్లా కైరానా నియోజకవర్గం నుంచి లోక్ సభ కు పోటీ చేసి ఓడి పోయారు.
1985లో బిజ్ నూర్ ,1989లో హరిద్వార్ నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత 1989, 1998, 1999, 2004లో వరుసగా లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1994, 2004లో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.
1995, 1997, 2002 లో కొంత కాలం పాటు యూపీ సీఎంగా కొలువుతీరారు మాయావతి(Mayawati ).
2007 నుంచి 2009 దాకా. ఆమె రచయిత కూడా. బహుజన్ సమాజ్ ఔర్ ఉస్కీ రాజ్ నీతి ఇంగ్లీష్ లో ఉంది.
బహుజన్ మూమెంట్ కా సఫర్ నామా హిందీలో ఉంది. దేశంలోని లక్షలాది మంది దళితులు ఆమెను ఓ ఐకాన్ గా చూస్తారు.
మాయావతిని అంతా బెహన్ జీ అని ప్రేమగా పిలుస్తారు. ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మరెన్నో విమర్శలు మూటగట్టుకున్నారు.
ఏది ఏమైనా అగ్రవర్ణాల ఆధిపత్యానికి చెక్ పెట్టిన ధీర వనిత మాయావతి.
Also Read : అక్షరాలతో అగ్గి రాజేసిన అలిశెట్టి