RTI ACT 2005 : సమాచార హక్కు చట్టం పాశుపతాస్త్రం
సామాన్యులకు ఆయుధం
RTI ACT 2005 : భారత దేశంలో ఇప్పటి వరకు తీసుకు వచ్చిన చట్టాలలో అరుదైన చట్టంగా పేరొందింది సమాచార హక్కు చట్టం. దీనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చారు. నేటికీ చట్టంగా ఉన్నా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ప్రత్యేకించి తెలంగాణలో దుర్భరంగా ఉంది.
అడిగిన సమాచారం ఇవ్వడంలో తాత్సారం జరుగుతోంది. సరిగ్గా ఇదే రోజు అక్టోబర 12, 2005లో సమాచార హక్కు చట్టంగా అమలులోకి వచ్చింది.
ఇది చరిత్రాత్మకం అని చెప్పక తప్పదు. ఈ దేశంలోని ప్రతి పౌరుడికి తను కావాలని కోరుకునే సమాచారాన్ని నిరభ్యంతరంగా కోరవచ్చు.
సమాచారాన్ని తెలసు కోవడం అనేది ప్రాథమిక హక్కు. ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థ ఉన్నా ఉండీ లేనట్టుగా ఉంది. సహ చట్టం వల్ల కొన్ని మంచి పనులు కూడా జరిగాయి.
కొందరికి శిక్షలు కూడా పడిన దాఖలాలు ఉన్నాయి. కానీ సహ చట్టం కమిషనర్ ల నియమాకంలో రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల ఆశించిన రీతిలో ఫలితాలు రావడం లేదు.
ఇంకొందరు కావాలని సమాచారాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని తీసుకునే వీలు కలుగుతుంది సహ చట్టం -2005(RTI ACT 2005) ద్వారా.
ఇంతకు ముందు పార్లమెంట్ , విధాన సభ , విధాన మండలి సభ్యులకు మాత్రమే సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉండేది.
కానీ ఈ 2005 చట్టం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసుకునే హక్కు దీని ద్వారా సమకూరింది. ప్రభుత్వ అధికారులు ఎవరూ అడగక పోయినా తమకు సంబంధించి పూర్తి వివరాలు పొందు పర్చాలి.
17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు ప్రజలకు కనిపించేలా బోర్డుల మీద రాసి ఉంచాలి.
ఈ చట్టంలో 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు ఉన్నాయి. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు,
సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు ఏవైనా సరే అడిగిన వెంటనే
ఇవ్వాల్సి ఉంటుంది.
భద్రతా, గూఢచార సంస్థలకు మినహాయింపు ఉంది. దరఖాస్తు తెల్ల కాగితం మీద రాస్తే చాలు సమాచారం ఇవ్వాల్సిందే. తెల్లకార్డుదారులకు
ఫీజు లేదు.
మండల స్థాయిలో రూ. 5, జిల్లా స్థాయిలో రూ. 10 కి మించి రుసుము వసూలు చేయకూడదు. 30 రోజులు దాటితే సమాచారం
ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
రశీదు పొందాలి. ఇవ్వక పోతే కారణాలు తెలియ చేయాలి. అడిగిన సమాచారం ఇవ్వని పక్షంలో కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార
కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వీలుంటుంది.
చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని సమాచార కమిషన్ పేర్కొంది.
Also Read : ఆర్థిక వృద్దిలో భారత్ బెటర్ – ఐఎంఎఫ్