వ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఐసీసీ చైర్మ‌న్

న్యూఢిల్లీ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మ‌న్ జే షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చాలా మంది కొన్ని జ‌ట్లు లేకుండా ఎలా ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌శ్నించార‌ని, ఆపై దుష్ప్ర‌చారం చేసేందుకు య‌త్నించార‌ని అన్నారు. ఓ జాతీయ మీడియా నిర్వ‌హించిన అవార్డుల కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా జే షా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి బయటకు లాగడంపై స్పందించారు. బంగ్లాదేశ్ ఇతరుల మాట విని ప్రపంచ కప్‌ను బహిష్కరించిందని చెప్పారు. దీని ఫలితంగా వారు గ‌ణ‌నీయంగా తమ ఆదాయాన్ని కోల్పోయారని పేర్కొన్నారు జే షా.

అంతే కాకుండా ఈ జట్టు రాకపోతే, ప్రపంచ కప్ ఎలా విజయవంతం అవుతుంద‌ని ఎద్దేవా చేశార‌ని గుర్తు చేశారు. అయితే ఐసీసీ కానీ, లేదా ఇత‌ర సంస్థ‌లు ఎప్పుడూ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి టోర్న‌మెంట్ లు నిర్వ‌హించ‌డం జ‌ర‌గ‌ద‌న్నారు. ఒక‌రు ఉన్నా లేదా బ‌హిష్క‌రించినా ఐసీసీకి ఒన‌గూరే న‌ష్టం అంటూ ఏమీ ఉండ‌ద‌న్నారు. ఇక‌పోతే బ‌హిష్క‌రించే జ‌ట్ల‌కే అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. అన్ని జట్లు సమానంగా పాల్గొంటాయ‌ని తెలిపారు. విచిత్రం ఏమింటే ఐసీసీ ఏ ఒక్క జ‌ట్టుపై ఆధార ప‌డ‌డం కానీ, లేదా ఇంకో జ‌ట్టును ప్రోత్స‌హించ‌డం చేయ‌ద‌న్నారు. ఐసీసీ ప్రపంచ కప్ 7.2 మిలియన్ల ఏకకాల వీక్షణలను అందుకుందని వెల్ల‌డించారు జే షా. ఇది ఇప్పటివరకు అత్యధికం అని, గ‌తంలో ఉన్న అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింద‌న్నారు.

ఈ ప్రపంచ కప్‌లో తామ‌ము చాలా ఎదురు దెబ‌బ్బ‌లుతో పాటు షాకింగ్ కు గురైన‌ట్లు తెలిపారు. అమెరికా భారతదేశాన్ని ఆశ్చర్య పరిచిందని, నెదర్లాండ్స్ పాకిస్తాన్‌ను షాక్‌కు గురి చేసిందన్నారు. ఇక జింబాబ్వే ఆస్ట్రేలియాను కూడా ఓడించడంతో టోర్నీ నుంచి నిష్క‌మించింద‌న్నారు. ఈ ప్రపంచ కప్‌ను చిరస్మరణీయంగా మార్చడంలో గణనీయమైన కృషి చేసిన అన్ని అసోసియేట్ జట్లకు కూడా నేను ప్రత్యేక ప్రశంసలు తెలియ జేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు జే షా.

Leave A Reply

Your Email Id will not be published!