S Jai Shankar : ప్రపంచం భారత్ పక్షాన నిలిచింది
విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్
S Jai Shankar : ఒడిశాలో చోటు చేసుకున్న భారీ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రపంచంలోని పలు దేశాలన్నీ భారత్ కు అండగా నిలిచాయని స్పష్టం చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar). నలు మూలల నుండి పెద్ద ఎత్తున నాయకులు, దేశాధిపతులు, అధ్యక్షులు, చైర్మన్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం సంతాప సందేశాలు తనకు పంపించారని తెలిపారు.
నమీబియాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రైలు ప్రమాదం నేపథ్యంలో తనకు అందిన సంతాప సందేశాలు, సానుభూతి వ్యక్తం చేయడంలో భారత దేశంతో ప్రపంచం ఎంత అనుబంధంగా ఉందో తెలియ చేసిందని అన్నారు. విదేశాంగ మంత్రులు పెద్ద ఎత్తున స్పందించారు. తమ సంఘీభావం ప్రకటించారు.
నేటి ప్రపంచం ఎంతగా ప్రపంచీకరణ చెందిందో, ప్రపంచం భారత దేశంతో ఎలా ముడి పడి ఉందనే దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు సుబ్రమణ్యం జై శంకర్. భారత దేశంలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. ప్రపంచం భారత్ తో నిలబడాలని నిర్ణయించుకుందని ఈఏఎం జోడించింది. ఇదిలా ఉండగా ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి.
నేను భౌతికంగా మాత్రమే ఇక్కడ ఉన్నాను. కానీ నా హృదయం మాత్రం భారత దేశంలో ఉందన్నారు. ఈ రోజు మా ప్రార్థనలన్నీ దాని కోసమేనని స్పష్టం చేశారు ఎస్. జై శంకర్.
Also Read : LIoyd Austin Arrive : భారత్ కు చేరుకున్న లాయడ్ ఆస్టిన్
