ఐపీఎల్ 16వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఘోరమైన ఓటమిని చవి చూసింది. 112 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. 10.3 ఓవర్లలోనే 59 పరుగులకే చాప చుట్టేసింది. రాజస్థాన్ జట్టులో ఇద్దరు తప్ప ఏ ఒక్క ఆటగాడు డబుల్ డిజిట్ దాటలేదు. జో రూట్ 10 రన్స్ చేస్తే షిమ్రోన్ హిట్మెయర్ 35 పరుగులతో రాణించాడు.
ఆర్సీబీ బౌలర్ల ధాటికి విల విల లాడారు రాజస్థాన్ బ్యాటర్లు. ప్రధానంగా వేన్ పార్నెల్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసి 10 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. జోస్ బట్లర్ , యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ లుగా వెనుదిరిగారు. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడాడు.
పరాజయం గురించి తాను ఏమీ మాట్లాడదల్చు కోలేదన్నాడు. ఓటమికి తన వద్ద ఎలాంటి ఆన్సర్ లేదన్నాడు. ఆర్సీబీ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రాణించిందని కితాబు ఇచ్చాడు. గెలిచిన జట్టుకు అభినందనలు తెలిపాడు. వికెట్ పూర్తిగా ప్రత్యర్థి జట్టుకు సహకరించిందని పేర్కొన్నాడు. ఓటమికి కుంటి సాకులు చెప్పడం లేదన్నాడు సంజూ శాంసన్. ఇది తమకు ఓ గుణపాఠంగా మిగిలి పోతుందన్నాడు స్కిప్పర్.
