Ricky Skerritt : వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చీఫ్ రికీ స్కెరిట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు సంబంధించిన కెప్టెన్ కీరన్ పొలార్డ్ , కోచ్ ఫిల్ సిమన్స్ లపై తీవ్ర ఆరోపణలు రావడంతో స్పందించాడు.
ఆట పరంగా కోచింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. తాము బయటి వాతావరణం గురించి పట్టించు కోమన్నాడు. క్రికెటేతర కారణాల వల్లే ఇలా జరుగుతోందన్నాడు.
దీంతో కెప్టెన్ కీరన్ పొలార్డ్ , కోచ్ ఫిల్ లను తాము తొలగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు రికీ స్కెరిట్. కోచ్,, కెప్టెన్ లపై వస్తున్న విమర్శలను తాము పట్టించుకోమని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 6 నుంచి భారత్ లో టీ20, వన్డే మ్యాచ్ లు ఆడనుంది వెస్టిండీస్ టీమ్. ఇప్పటికే స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన 5 టీ20 మ్యాచ్ లలో 3-2 తేడాతో వెస్టిండీస్ సీరీస్ చేజిక్కించుకుంది.
అయితే ఐర్లాండ్ చేతిలో వన్డే సీరీస్ ఓటమి పాలైంది. ఇదే సమయంలో కొందరు ఆటగాళ్ల పట్ల పొలార్డ్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు వివక్ష చూపిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి.
దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చీఫ్ రికీ స్కెరిట్(Ricky Skerritt) స్పందించాడు. కొందరు కావాలని చేస్తున్నారే తప్పా అలాంటిది ఏమీ లేదని కొట్టి పారేశాడు.
దీనిని ఆయన పూర్తిగా ఖండించాడు. ఒకవేళ భారత్ టూర్ లో విండీస్ జట్టు సరిగా ఆడలేక పోతే , తమ బాధ్యతలను విస్మరిస్తే గనుక కచ్చితంగా ఉంచాలా లేదా అన్న విషయంపై ఆలోచిస్తామని పేర్కొన్నాడు.
అకారణంగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అది జట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నాడు.
Also Read : కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే కష్టం