Anurag Thakur : విచార‌ణ పూర్త‌య్యే దాకా ‘బ్రిజ్’ ఉండ‌రు

కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్

Anurag Thakur : భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య చీఫ్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 30 మందికి పైగా మ‌హిళా రెజ్లెర్లు ఆందోళ‌న చేప‌ట్టారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. ఇవాళ్టితో నాలుగో రోజు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) కు లేఖ రాశారు.

ఇప్ప‌టికే 72 గంట‌ల గ‌డువు ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో భార‌త ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉష ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఈ మేర‌కు మేరీ కోమ్ ఆధ్వ‌ర్యంలో ఏడుగురు స‌భ్యుల‌తో క‌మిటీని ఏర్పాటు చేసింది. విచార‌ణ చేప‌ట్టిన త‌ర్వాత కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని వెల్ల‌డించారు ఐఓసీ చీఫ్ పీటీ ఉష‌.

ఇదిలా ఉండ‌గా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విచార‌ణ పూర్త‌య్యేంత వ‌ర‌కు భార‌త రెజ్ల‌ర్స్ స‌మాఖ్య చీఫ్ గా ఉన్న బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ఉండ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. అత‌డిని ప‌క్క‌న పెట్టామ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సీరియ‌స్ గా తీసుకున్నార‌ని తెలిపారు.

ఏడు గంట‌ల పాటు స‌మావేశం జ‌రిగింది. మ‌హిళా రెజ్ల‌ర్లతో మాట్లాడిన అనంత‌రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. నివేదిక ఇవ్వ‌డానికి నాలుగు వారాల స‌మ‌యం ప‌డుతుంది. లైంగిక వేధింపులు లేదా ఆర్థిక అక్ర‌మాల‌కు సంబంధించి పూర్తిగా విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. బ‌జ్ రంగ్ పూనియా ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Also Read : బ్రిజ్ భూష‌ణ్ పై విచార‌ణ‌కు క‌మిటీ

Leave A Reply

Your Email Id will not be published!