S Jai Shankar : పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలు ఉండవు
విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఇక నుంచి క్రికెట్ సంబంధాలు ఉండవని వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది 2023లో రెండు మెగా టోర్నీలు జరగనున్నాయి. ఒకటి ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగనుండగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ భారత్ లో కొనసాగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ లో చోటు చేసుకున్న భద్రతా కారణాల రీత్యా తమ జట్టు ఆసియా కప్ లో పాల్గొనబోదని స్పష్టం చేశారు బీసీసీఐ సెక్రటరీ జే షా.
ఇందుకు సంబంధించి శనివారం సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. టోర్నమెంట్ లు వస్తూనే ఉంటాయని కానీ ఆటగాళ్ల భద్రత తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ రెండు జట్లు చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సీరీస్ ఆడాయి. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఎలాంటి క్రికెట్ సంబంధాలు ఉండబోవని పేర్కొన్నారు జై శంకర్.
బీసీసీఐ ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆపై తమతో జరిగే ఆసియా కప్ లో భారత్ ఆడక పోతే తమ జట్టు భారత్ లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాల్గొన బోదంటూ ప్రకటించారు. ఓ వైపు తుపాకులు తలపై పెట్టి క్రికెట్ ఆడమంటే ఆడతామా అని ప్రశ్నించారు జై శంకర్.
క్రికెట్ పై మా స్టాండ్ క్లియర్ గా ఉంది. పాకిస్తాన్ కావాలని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.
Also Read : మెరిసిన మెస్సీ సెమీస్ కు అర్జెంటీనా