BCCI AGM : బీసీసీఐ కీలక నిర్ణయాలు ఇవే
మహిళల ఐపీఎల్ కు బీసీసీఐ ఓకే
BCCI AGM : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సర్వ సభ్య సమావేశం ముంబైలో జరిగింది. ఈ మేరకు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీసీసీఐ బాస్ గా రోజర్ బిన్నీ, కార్యదర్శిగా జే షా ఎన్నికయ్యారు. కొలువు తీరిన కార్యవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా అందరూ భావించినట్లుగానే మహిళలకు సంబంధించి వచ్చే ఏడాదిలో ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించింది. బోర్డు ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన సంస్థగా పేరొందిన బీసీసీఐకి 36వ అధ్యక్షుడిగా బిన్నీ ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు.
ఈరోజు నుంచి మూడేళ్ల పాటు బీసీసీఐ బాస్ గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ నిష్క్రమించాడు. ఇదిలా ఉండగా ఈ బీసీసీఐ సమావేశంలో ఐసీసీ చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయలేదు. దీనికి దాఖలు చేసేందుకు అక్టోబర్ 20 డెడ్ లైన్. బీసీసీఐ 91వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా బాస్ గా బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా, కార్యదర్శి గా జే షా, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా ఆశిష్ షెలార్ ఎన్నికయ్యారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ లో జనరల్ బాడీ ప్రతినిధిగా ఎంకేజే మజుందార్(BCCI AGM) ఎన్నికయ్యారు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ లో ఇద్దరు ప్రతినిధులు ఎన్నికయ్యారు.
అరుణ్ సింగ్ ధుమాల్ , అవిషేక్ దాల్మియా. 2021-22 కోసం ఆడిట్ చేసిన ఖాతాలు జనరల్ బాడీ ఆమోదించింది. దీంతో పాటు 2022-23 వార్షిక బడ్జెట్ ను కూడా ఆమోదించడం విశేషం. 2023- 2027 కోసం సీనియర్ పురుషుల ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ , 2022-25 కోసం సీనియర్ ఉమెన్స్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ జనరల్ బాడీ ఓకే చెప్పింది.
Also Read : ఆసియా కప్ కోసం పాక్ కు భారత్ వెళ్లదు