ICC T20 World Cup : అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి – ఐసీసీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్త ఏడాది బిగ్ అప్ డేట్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా వేదికగా ఈసారి టీ20 వరల్డ్ కప్ జరగనుంది.
ఓ వైపు కరోనా కేసులు మరో వైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల దెబ్బకు నిర్వహించాలా వద్దా అన్న అనుమానం నెలకొన్న తరుణంలో ఖుష్ కబర్ చెప్పింది ఐసీసీ క్రికెట్ అభిమానులకు.
ఇప్పటికే యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021ను ఆస్ట్రేలియా మొదటిసారిగా గెలుచుకుంది. న్యూజిలాండ్ ను ఓడించి విజయం సాధించింది.
ఇక టీ20 వరల్డ్ కప్ 2022 (ICC T20 World Cup)విషయానికి వస్తే ఈ మెగా టోర్నీకి సంబంధించి వేదికలు ఖరారైనట్లు వెల్లడించింది ఐసీసీ.
టోర్నీకి సంబంధించి ప్రధానంగా పలు వేదికలను చూశామని కానీ చివరకు అందరికీ అన్ని టీంలకు ఆమోద యోగ్యంగా ఉండేందుకు గాను 7 వేదికలను ఖరారు చేసినట్లు స్పష్టం చేసింది.
ఇందులో భాగంగా ఎంపిక చేసిన వేదికలను ప్రకటించింది ఐసీసీ. మెల్ బోర్న్ , హోబర్ట్ , పెర్త్ , బ్రిస్బేన్ , అడిలైడ్ , సిడ్నీ, గీలాంగ్ నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది.
కాగా టీ20 వరల్డ్ కప్ 2022 మెగా లీగ్ లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 మధ్యలో జరగనుందని ఐసీసీ వెల్లడించింది. ఈనెల 21న వరల్డ్ కప్ షెడ్యూల్ , తదితర వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది.
Also Read : కోహ్లీ నిర్ణయంపై అఫ్రిదీ కామెంట్