Sanjay Manjrekar : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ చేశారు. పాత వాళ్లను మొత్తం తీసేసి కొత్త వాళ్లను తీసుకోవాలని సూచించాడు.
ప్రధానంగా భారత జట్టు సఫారీ టూర్ లో వన్డే సీరీస్ తో పాటు 1-2 తేడాతో టెస్టు సీరీస్ కూడా కోల్పోయింది. ఇక హెడ్ కోచ్ గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పటికీ టీమిండియా ఘోరంగా ఓటమి మూట గట్టుకోవడాన్ని కోట్లాది క్రీడాభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు.
దీనిపై మండి పడుతున్నారు. ప్రధానంగా అన్ని ఫార్మాట్ లలో చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచారు. ఈ తరుణంలో సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar )చేసిన కామెంట్స్ చేయడం కలకలం రేపాయి.
ఈసారి బీసీసీఐ సెలెక్టర్ల జట్టు ఎంపిక తీరుపై మండిపడ్డాడు. అసలు ఎలా ఆలోచిస్తున్నారంటూ నిలదీశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆటగాళ్లను పూర్తిగా పక్కన పెట్టాలని సూచించాడు.
వెంటనే వారి స్థానంలో కొత్తగా దుమ్ము రేపుతున్న ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపిక విధానం సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ మంజ్రేకర్.
ప్రత్యర్థి జట్లకు ధీటుగా ఆడే ఆటగాళ్లను ఎంపిక చేయక పోవడం దారుణమన్నాడు. ఇప్పటి దాకా ఎంపిక చేసిన ఆటగాళ్లు తన పరీక్షలు ఎవరూ పాస్ కాలేదన్నాడు.
మిడిల్ ఆర్డర్ లో పూర్తిగా బ్యాటర్ లు పూర్తిగా వైఫల్యం చెందడాన్ని తప్పు పట్టాడు మంజ్రేకర్. ఇదిలా ఉండగా భారత్ ఘోర ఓటమి పొందిన తర్వాత సెలెక్టర్లతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read : టీ20 సీరీస్ కు శ్రీలంక సారథిగా ‘షనక’