Swati Maliwal : శ్వాస ఉన్నంత దాకా పోరాడుతూనే ఉంటా
బీజేపీ కామెంట్స్ స్వాతి మలివాల్ ఫైర్
Swati Maliwal : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు. తాను జీవించి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
తాజాగా స్వాతి మలివాల్(Swati Maliwal) రాత్రి తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవిస్తున్న డ్రైవర్ వేధించాడని, తనకే సెక్యూరిటీ లేక పోతే దేశ రాజధానిలో మహిళలకు ఎలా రక్షణ లభిస్తుందంటూ ప్రశ్నించారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఇదంతా ఆప్ , స్వాతి మలివాల్ కలిసి ఆడుతున్న నాటకం అంటూ పేర్కొన్నారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్వాతి మలివాల్ నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో స్వాతి మలివాల్ ను కారు డ్రైవర్ వేధిస్తున్న వీడియో హల్ చల్ చేస్తోంది.
అయితే తను ఆరోపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి అని బీజేపీ ఆరోపించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.
ఈ సందర్భంగా స్వాతి మలివాల్ శనివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. నా గురించి బూటకపు అబద్దాలు చెప్పి నన్ను భయ పెడతారని భావించే వారికి చెప్పినవ్వండి.
ఈ చిన్న జీవతంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని స్పష్టం చేశారు స్వాతి మలివాల్(Swati Maliwal) . నాపై ఎన్నో దాడులు జరిగాయి ఇప్పటి వరకు. కాన తాను ఏనాడూ భయ పడలేదన్నారు. నా గొంతును ఎవరూ అణచ లేరని పేర్కొన్నారు. తాను జీవించి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు.
Also Read : విచారణ పూర్తయ్యే దాకా ‘బ్రిజ్’ ఉండరు