Wasim Jaffer : సఫారీ టూర్ లో భాగంగా ఇప్పటికే భారత్ 2-1 తేడాతో టెస్టు సీరీస్ కోల్పోయింది. ఈ తరుణంలో రేపటి నుంచి మూడు వన్డే సీరస్ ఆడనుంది.
టీ20, వన్డే జట్టుతో పాటు టెస్టు టీమ్ కు పూర్తిగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.
ఇక ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే వన్డే మ్యాచ్ లో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇందుకు గాను మాజీ క్రికెటర్, మాజీ కోచ్ వసీం జాఫర్(Wasim Jaffer )ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే బెటర్ అని సూచించాడు భారత జట్టు హెడ్ కోచ్ , కెప్టెన్లకు.
ఇప్పటికే తొడ కండరాల నొప్పి ఉండడంతో సఫారీ టూర్ నుంచి తప్పుకున్నాడు ఫుల్ టైమ్ కెప్టెన్ రోహిత్ శర్మ.
దీంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఫస్ట్ వన్డే జట్టు ఎలా ఉండబోతుందనేది తానే సెలక్టు చేశాడు.
ఇందులో విచిత్రం ఏమిటంటే ఢిల్లీ స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ కు చోటు ఇచ్చాడు.
భారత జట్టు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లను ఎంపిక చేశాడు. నెంబర్ 3, 4 స్థానాల్లో విరాట్ కోహ్లీ,
శ్రేయాస్ అయ్యర్ అయిత బాగుంటుందని పేర్కొన్నాడు.
కెప్టెన్ గా రిజైన్ చేశాక దిగే వన్డే మ్యాచ్ లో ఎలా ఆడతాడనేది కోహ్లీపై అందరి ఫోకస్ ఉంటుందని స్పష్టం చేశాడు వసీం జాఫర్(Wasim Jaffer ).
ఇషాన్ కిషన్ కంటే రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా బాగుంటుందన్నాడు.
సూర్య కుమార్ యాదవ్ ను ఆరో స్థానంలో పంపిస్తే పరుగులు రాబట్టేందుకు చాన్స్ ఉంటుందని తెలిపాడు.
ఆల్ రౌండర్ గా వెంకటేష్ అయ్యర్ ను కాకుండా శార్దూల్ ఠాకూర్ ను ఎంపిక చేశాడు.
అతడి జట్టులో ఇద్దరు స్పిన్నర్లను చేర్చాడు. రవిచంద్రన్ అశ్విన్ , యుజువేంద్ర చాహల్ ఉన్నారు.
సీమర్ల పరంగా చూస్తే సిరాజ్ , భువీలను ఎంపిక చేశాడు. చివరి నిమిషంలో ఇంకా సిరాజ్ ఫిట్ నెస్ గురించి క్లారిటీ రాలేదన్నాడు జాఫర్.
Also Read : కోహ్లీ ఎల్లప్పటికీ సూపర్ హీరో