Virat Kohli : భారత క్రికెట్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్ లో ఇవాళ 100వ టెస్టు ఆడుతున్నాడు.
ఈ సందర్భంగా మొహాలీ మైదానంలో శ్రీలంకతో ఆడే కంటే ముందు బీసీసీఐ కోహ్లీని (Virat Kohli )సన్మానించింది.
అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఓ జ్ఞాపకాన్ని అందజేశాడు. ఈ కార్యక్రమంలో కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కొద్ది సేపు మాట్లాడాడు. ఇది నా జీవితంలో, నా క్రికెట్ కెరీర్ లో అరుదైన క్షణం. నేను ప్రాణ ప్రదంగా ప్రేమించే భార్య కూడా ఇక్కడే ఉంది.
నేను ఎప్పుడూ అనుకోలేదు ఇవాళ మీ ముందు ఉంటానని. ప్రయత్నం చేస్తూ వెళ్లా. ఒక్కోసారి గాయాలు ఉన్నాయి. ఇంకోసారి మెరుపులు ఉన్నాయి. గెలుపులు, ఓటములు ఇవన్నీ నాకు అలవాటుగా మారాయి.
నా భార్య నాతో పాటు ఉండడం నాకు ఓ బిగ్ అస్సెట్ . మా జీవితంలో ఇంకో ప్రాణం మా పాప కూడా ఉండడం నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది.
ఇవాళ 100వ టెస్టు ఆడడం ఇది ఓ మైలు రాయిగా మారుతుందని నేను అనుకోలేదన్నాడు విరాట్ కోహ్లీ(Virat Kohli ).
నాతో పాటు నా సోదరుడు కూడా ఇక్కడికి వచ్చాడు. ప్రతి వ్యక్తి విజయం వెనుక కుటుంబం ఉంటుందన్నాడు.
మీరందరూ లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదన్నాడు. ప్రత్యేకంగా తనను ప్రోత్సహిస్తూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియ చేసుకుంటున్నానని చెప్పాడు.
అన్ని ఫార్మాట్ లలో నేను వంద శాతం నా శక్తిని కేటాయించానని చెప్పగలనన్నాడు. కోహ్లీ 12వ భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
అంతకు ముందు గవాస్కర్, వెంగ్ సర్కార్, కపిల్ దేవ్ , సచిన్ , కుంబ్లే, ద్రవిడ్ , గంగూలీ, లక్ష్మణ్ , సెహ్వాగ్ , భజ్జీ, ఇషాంత్ శర్మ ఉన్నారు.
Also Read : క్రికెట్ కు వన్నె తెచ్చిన ఆటగాడు కోహ్లీ