Swati Maliwal : అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులు

మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్

Swati Maliwal : ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ కు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. బిగ్ బాస్ లో సాజిద్ ఖాన్ పై లేఖ రాసినందుకు ఆమెను చంపుతామంటూ పేర్కొన‌డం చ‌ర్చ‌కు దారితీసింది. మీటూ ఆరోప‌ణ‌ల‌పై ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ స్వాతి మ‌లివాల్ స్వ‌రం పెంచారు.

ఈ మేర‌కు నిర్మాత సాజిద్ ఖాన్ ను వెంట‌నే బిగ్ బాస్ నుంచి తొల‌గించాల‌ని కోరుతూ కేంద్ర స‌మాచార , ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాసింది. ఇదిలా ఉండ‌గా సాజిద్ ఖాన్(Sajid Khan) పై కేంద్రానికి లేఖ రాసిన‌ప్ప‌టి నుంచి త‌న‌కు అత్యాచార బెదిరింపులు వ‌స్తున్నాయంటూ ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ స్వాతి మ‌లివాల్ చెప్పారు.

ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సాజిద్ ఖాన్ పై ఫిర్యాదు చేసిన‌ప్ప‌టి నుంచి త‌న‌కు సోష‌ల్ మీడియాలో రేప్ బెదిరింపులు వ‌స్తున్నాయంటూ స్వాతి మలివాల్(Swati Maliwal) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాస్త‌వంగా వారు త‌మ ప‌నిని ఆపాల‌ని అనుకుంటున్నారు.

నేను ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నాన‌ని తెలిపారు స్వాతి మ‌లివాల్. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయండి. దీని వెనుక ఉన్న వారిని అరెస్ట్ చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు.

ఇప్ప‌టికే మీటూ ద్వారా 10 మందికి పైగా మ‌హిళ‌లు త‌మ‌ను లైంగికంగా నిర్మాత సాజిద్ ఖాన్ వేధింపుల‌కు గురి చేశాడంటూ మ‌హిళా క‌మిష‌న్ ను ఆశ్ర‌యించారు. దీంతో స్వాతి మ‌లివాల్ స్పందించింది. చ‌ర్య‌కు సిఫార్సు చేసింది.

Also Read : దోషులు ఎవ‌రో తేల్చ‌క‌పోతే ధ‌ర్నా – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!