Tilak Varma : ఎవరీ తిలక్ వర్మ అనుకుంటున్నారా. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022లో అనూహ్యంగా ముంబై ఇండియన్స్ కు కీలకమైన ఆటగాడిగా మారాడు. జట్టు కష్టాలలో ఉన్నప్పుడు మనోడు అద్భుతంగా ఆడుతూ వస్తున్నాడు.
తాజాగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఒకానొక దశలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఒడ్డుకు చేర్చాడు. గౌరవ ప్రదమైన స్కోర్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
ఏకంగా 51 రన్స్ చేసి ఆదుకున్నాడు. ప్రతి మ్యాచ్ లో నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు తిలక్ వర్మ(Tilak Varma). ఇక తిలక్ వర్మ అసలు పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. వయసు 19 ఏళ్లు. 8 నవంబర్ 2002లో పుట్టాడు.
ఎడమ చేతి బ్యాటర్. 2018 నుంచి హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2020లో అండర్ -19 ప్రపంచ కప్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు తిలక్ వర్మ.
పేరెంట్స్ నంబూరి నాగరాజు, గాయత్రీదేవి. స్వస్థలం హైదరాబాద్. తిలక్ వర్మ చందానగర్ లోని పీజేఆర్ స్టేడియంలో కోచ్ సలాం వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం లింగంపల్లి క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.
2018-19 లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. 2022 జనవరి 31 నాటికి లిస్ట్ -ఏలో 16 మ్యాచ్ లు ఆడి 784 రన్స్ చేశాడు. తిలక్ వర్మ ఐపీఎల్ -2022 మెగా వేలంలో 20 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చాడు.
సన్ రైజర్స్ , రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. సీఎస్కే కూడా ట్రై చేసింది. చివరకు ముంబై ఇండియన్స్ కోటి 70 లక్షలకు తిలక్ వర్మను తీసుకుంది
Also Read : విజ్డెన్ ఐదుగురు క్రికెటర్లలో రోహిత్..బుమ్రా.