Tim David : ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్ డేవిడ్
11 బంతులు 2 ఫోర్లు 4 సిక్సర్లు 34 రన్స్
Tim David : ఐపీఎల్ 2022లో ఆఖరి అంకం ముగిసింది. గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులారా ఓటమి పాలై ఇంటి బాట పట్టింది. కెప్టెన్ రిషబ్ పంత్ పేలవమైన కెప్టెన్సీ కూడా పరాజయానికి కారణమైంది.
ఇక తమ చేతుల్లో ఉందని అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు టిమ్ డేవిడ్(Tim David). కేవలం 11 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టాడు. 34 పరుగులు చేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 159 రన్స్ చేసింది. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పరుగులు చేయకుండా కట్టడి చేశారు. ప్రధానంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు కీలక వికెట్లు తీశాడు.
మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. మిడిల్ ఆర్డర్ బాగా రాణించినా జట్టును గట్టుకు చేర్చడంలో విఫలమయ్యారు. టీమ్ మేనేజ్ మెంట్ , కెప్టెన్ పంత్ మధ్య అవగాహన రాహిత్యం కూడా కొంప ముంచింది.
అసలైన టైమ్ లో డీఆర్ఎస్ తీసుకోక పోవడం కూడా పంత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ టిమ్ డేవిడ్ ఔట్ అయి ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా గెలిచి ఉండేది.
మొత్తంగా తను ఓడినా ఢిల్లీ క్యాపిటల్స్ ను ప్లే ఆఫ్స్ కు చేరకుండా అడ్డు కోవడంలో సక్సెస్ అయ్యింది ముంబై ఇండియన్స్ . అందుకే ఆర్సీబీ అభిమానులు, ప్రత్యేకించి మాజీ భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ సేనకు థ్యాంక్స్ చెప్పడం చర్చకు దారి తీసింది.
ఏది ఏమైనా ముంబై అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. చిరస్మరణీయమైన విజయం సాధించింది. పరువు పోకుండా గెలిచింది.
Also Read : ముంబై దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్