Tirumala Heavy Rush : తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 81,655
Tirumala Heavy Rush : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం శ్రీనివాసుడికి ప్రాణప్రదమైన రోజు కావడంతో భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎక్కడ చూసినా తిరుమల గిరులు భక్తులతో నిండి పోయాయి. గోవిందా గోవిందా, అనాధ రక్షక గోవిందా అంటూ భక్తులు శ్రీవారి నామ స్మరణతో దద్దరిల్లేలా స్మరించుకున్నారు.
Tirumala Heavy Rush with Devotees
సెప్టెంబర్ 2న శనివారం ఏకంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 81 వేల 655 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 38 వేల 882 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం శ్రీవారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా వేచి ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కలిగేందుకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా నూతనంగా చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో భక్తులను పరామర్శించారు. టీటీడీ అందజేస్తున్న వసతి సౌకర్యాల గురించి వాకబు చేశారు. స్వయంగా ఆయన వారికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.
Also Read : IT HUB Nalgonda : నల్లగొండలో ఐటీ హబ్ రెడీ