Tirumala Heavy Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భక్తజనం
తిరుమలకు బారులు తీరిన భక్తులు
Tirumala Heavy Rush : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా , కలియుగ వైకుంఠ వాసుడిగా వినుతికెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువు తీరిన తిరుమల భక్తులతో నిండి పోయింది. ఎక్కడ చూసినా భక్త బాంధువులే. శ్రీనివాసా గోవిందా, అనాధ రక్షక గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా అంటూ భక్తులు శ్రీవారిని స్మరించుకున్నారు.
Tirumala Heavy Rush With People
శనివారం, ఆదివారం సెలవులు కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి , ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. మరో వైపు అలిపిరి దారి నడకన చిన్నారి ఘటన చోటు చేసుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సెక్యూరిటీని పెంచింది. ఇదే సమయంలో శ్రీవారి మెట్ల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడక దారుల్లో 100 మందికి పైగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 84 వేల 401 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 37,738 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక ప్రతి నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చాయని టీటీడీ వెల్లడించింది. స్వామి వారి దర్శనం కోసం తిరుమలలోని శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం స్వామి వారి దర్శనం 24 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది.
Also Read : Pawan Kalyan : జగన్ దేవుడు కాదు దెయ్యం – పవన్