Bhola Shankar Disaster : భోళా శంక‌ర్ కు మిశ్ర‌మ స్పంద‌న

దూసుకు పోతున్న ర‌జ‌నీ జైల‌ర్

Bhola Shankar Disaster : త‌మిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాన్ని తెలుగులో భోళా శంక‌ర్ గా తీశాడు ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్. ఈనెల‌లో ఇద్ద‌రు స్టార్ల సినిమాలు విడుద‌ల‌య్యాయి. త‌మిళ‌నాట టాప్ లో కొన‌సాగుతున్న త‌లైవా, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన నెల్స‌న్ దిలీప్ కుమార్ తీసిన జైల‌ర్. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే రూ. 220 కోట్ల మార్క్ ను దాటేసింది. ఇంకెన్ని కోట్లు కొల్ల‌గొడుతుందో వేచి చూడాలి. మొద‌ట్లో మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ మేన‌రిజం, బ్రాండ్ నేమ్ సినిమాను గ‌ట్టెక్కించింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

Bhola Shankar Disaster Talk

ఇక మెగాస్టార్ చిరంజీవి, త‌మ‌న్నా భాటియా , కీర్తి సురేష్ క‌లిసి న‌టించిన భోళా శంక‌ర్(Bhola Shankar) విడుద‌లకు ముందు భారీ అంచ‌నాల‌ను పెంచింది. కానీ రిలీజ్ అయ్యాక ద‌ర్శ‌కుడు స‌రిగా చిరంజీవిని వాడుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. విచిత్రం ఏమిటంటే ప్రేక్ష‌కులు పూర్తిగా నిరాశ‌కు లోను కావ‌డం విస్తు పోయేలా చేసింది.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ల జుగుస్స క‌లిగించే భ‌జ‌న‌కు తోడు, వ‌య‌సుకు త‌గ‌ని ప్ర‌వ‌ర్త‌న తీరు ఇలా ప్ర‌తిదీ భోళా శంక‌ర్ ను డిజాస్ట‌ర్ గా నిలిచేలా చేసింది.

Also Read : Tirumala Heavy Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Leave A Reply

Your Email Id will not be published!