Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.38 కోట్లు
స్వామిని దర్శించుకున్న 69,143 మంది భక్తులు
Tirumala Hundi : తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని, అలివేలు మంగమ్మల కరుణ కటాక్షం కోసం భక్తులు బారులు తీరారు. ఎక్కడ చూసినా గోవింద నామ స్మరణే వినిపిస్తోంది. గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా గోవిందా, శ్రీనివాస గోవిందా అంటూ భక్తులు పాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. తిరుమల గిరులన్నీ భక్తి పారవశ్యంతో అలరారుతున్నాయి.
గత ఆదివారం స్వామి వారిని 92 వేల మందికి పైగా దర్శించు కోవడం విస్తు పోయేలా చేసింది. ఇక వేసవి సెలవులు ముగిసినా ఇంకా భక్తుల తాకిడి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తిరుమల పుణ్య క్షేత్రాన్ని మంగళవారం 69 వేల 143 మంది దర్శించుకున్నారు. కాగా శ్రీవారి, అమ్మ వారికి భక్తులు భారీ పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) రూ. 4.38 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా వెల్లడించింది.
ఇదిలా ఉండగా టోకేన్లు లేకుండా సర్వ దర్శనం కోసం సుమారు 12 గంటల దాకా పట్టనుందని దేవస్థానం వెల్లడించింది. తిరుమలలోని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది. చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మా రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడడం విశేషం.
Also Read : PDA Alliance : ప్రతిపక్షాల ఫ్రంట్ పేరు పీడీఏ