Tirumala Laddu : తిరుమల లడ్డూ తయారీ విధానం పై వైసీపీ-టీడీపీ నేతల ఆరోపణలు
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి...
Tirumala : తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించామని, ఏ జంతువు నెయ్యి వాడలేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై తిరుమల(Tirumala) దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైవీ సవాల్‌పై టీడీపీ నేత కొలికిపూడి శ్రీనివాస్ స్పందించారు.
‘ తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై కొలికిపూడి శ్రీనివాస్ స్పందించారు. తిరుమల ప్రసాదం మీద ప్రమాణం చేద్దామని కోరారు. ఎప్పుడు, ఎక్కడ ప్రమాణం చేద్దామో మీరే చెప్పండి. ఏ రోజైనా వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ మాట మీద నిలబడ్డారా..? జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందు వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ కోరారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ అంశాన్నే మరిచారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇలానే జరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో అవకతవకలు జరిగాయి. దమ్ము, ధైర్యం ఉంటే విచారణ కోసం డిమాండ్ చేయండి అని’ కొలికిపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు.
Tirumala Laddu Making Issues…
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో టీడీపీ(Tirumala), వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. శ్రీవారి లడ్డూను జూలై 8వ తేదీన ల్యాబ్‌కు పంపించగా, 17వ తేదీన నివేదిక అందజేసింది. నెయ్యిలో సోయాబిన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు, చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు వాడారని నివేదికలో పేర్కొంది. నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యత పాటించలేదని వివరించింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి వాడారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు.
Also Read : Ravneet Singh Bittu : రాహుల్ ను టెర్రరిస్ట్ అంటూ సంబోధించిన కేంద్ర మంత్రిపై బెంగళూరు లో కేసు