Tirumala Pushpa Yagam : 19న శ్రీవారి పుష్ప యాగం
యాగానికి టీటీడీ అంకురార్పణ
Tirumala Pushpa Yagam : తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న ఆదివారం పుష్ప యాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది.శనివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్ప యాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).
Tirumala Pushpa Yagam on 19th
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్లు టీటీడీ(TTD) పేర్కొంది. ఇక పుష్ప యాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
Also Read : Padmavathi Utsavam : ఘనంగా పద్మావతి బ్రహ్మోత్సవాలు