Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు
61,904 మంది శ్రీనివాసుడి దర్శనం
Tirumala Rush : కలియుగ దైవంగా భావించే తిరుమలలో భక్తుల రద్దీ అలాగే కొనసాగుతూ వస్తోంది. నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మను 61 వేల 904 మంది దర్శించుకున్నారు. శ్రీవారికి 31 వేల 205 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఆ దేవ దేవుడి దర్శనం కోసం తిరుమల లోని 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి శ్రీవారి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల సంఖ్య భారీగానే ఉంది. వీరికి దర్శన భాగ్యం కలిగేందుకు కనీసం 14 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది.
Tirumala Rush With Devotees
ఇదిలా ఉండగా టీటీడీ చైర్మన్ గా కొత్తగా కొలువు తీరిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. వారి భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
శ్రీవారి మెట్లు, అలిపిరి కాలి నడకన వచ్చే భక్తుల కోసం చేతి కర్రలు ఇస్తామన్నారు. అటవీ శాఖ సూచించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు టీటీడీ చైర్మన్. అంతే కాకుండా 100 మందికి పైగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తనకు ఫోన్ చేయాలని సూచించారు.
Also Read : Liquor Shops Comment : మద్యం కోసం దరఖాస్తుల ప్రవాహం