Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.69 కోట్లు
తిరుమలకు పోటెత్తిన భక్త బాంధవులు
Tirumala Rush : పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత నెల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వేసవి కాలం ముగిసినా భక్తుల రద్దీ తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగూతనే ఉన్నారు. నిన్న ఆదివారం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం పోటెత్తారు. పుణ్య స్థలం అంతా భక్తులతో కిట కిట లాడింది. ఒక్క రోజు ఏకంగా ఆ దేవ దేవుడు, కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను 88 వేల 836 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇక ఎప్పటి లాగే తలనీలాలు సమర్పించుకునే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. స్వామి వారికి 35 వేల 231 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. పెద్ద ఎత్తున దర్శనం కోసం వచ్చిన భక్త బాంధవులు భారీ ఎత్తున కానుకలు, విరాళాలు సమర్పించారు. ఇటీవలి కాలంలో లేనంతగా జూలై 9న ఏకంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.69 కోట్లు రావడం విశేషం.
ఇక స్వామి వారి దర్శనం కోసం భక్తులు తిరుమల లోని 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం అంటే శ్రీవారి టోకెన్లు లేకుండా ఉన్న వారికి స్వామి, అమ్మ వార్ల దర్శనానికి కనీసం 36 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది.
Also Read : Pawan Kalyan Jagan : రూ. 1.18 లక్షల కోట్లకు లెక్క చెప్పు
