Tirumala Rush : తిరుమలలో 70 వేల పైగా భక్తుల రద్దీ
హుండీ ఆదాయం రూ. 3.88 కోట్లు
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమల(Tirumala) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు నెలల నుంచి వరుసగా 70 వేలకు పైగా భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఇదే సమయంలో భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా భారీ ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానంకు హుండీ ఆదాయం సమకూరుతోంది.
Tirumala Rush & Hundi Collection
మొన్న ఒక్క రోజే కొద్దిగా భక్తుల సంఖ్య తగ్గింది. తిరిగి శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 71 వేల 721 మంది దర్శించుకున్నారు. శ్రీవారికి 32 వేల 78 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఇదిలా ఉండగా కానుకల రూపేణా సమర్పించుకున్న విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3.88 కోట్లు వచ్చాయని తెలిపింది .
స్వామి వారి దర్శనంకోసం తిరుమల లోని కంపార్ట్ మెంట్లలో ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: Manipur Woman Parade Comment : భరతమాత కంటతడి