Tirumala Rush : వైకుంఠ దర్శనం టికెట్లు విడుదల
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా తిరుమల ఇసుక వేస్తే రాలనంతగా భక్త బాంధవులు కొలువు తీరారు.
Tirumala Rush with Devotees
చిన్నారులు, మహిళలు, వృద్దులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు, టీటీడీ(TTD) సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఎక్కడా లోటు పాట్లు రాకుండా చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈనెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదసి కావడంతో దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టింది టీటీడీ. ఇప్పటికే ఆలయాన్ని, స్వామి వారిని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అలంకరించింది.
వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 22 నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు విక్రయిస్తోంది. తిరుపతి లోని 10 కౌంటర్ల వద్ద దర్శనం టికెట్లు ఇస్తున్నట్లు తెలిపింది. మొత్తం 4 లక్షల 20 వేలకు పైగా టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
Also Read : Uttam Kumar Reddy : సీఎంతో ఉత్తమ్ భేటీ