Tirumala Rush : తిరుమలలో పోటెత్తిన భక్తజనం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.76 కోట్లు
Tirumala Rush : ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమల భక్తుల సందడితో కిట కిట లాడింది. నిన్న శనివారం కావడంతో భారీ ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం పోటెత్తారు. తిరుమల గిరులన్నీ గోవిందా గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా , అదివో అల్లదివో శ్రీహరి వాసము , పది వేల శేషుల పడగల మయం అంటూ భక్తులు పాడుకున్నారు. ఎక్కడ చూసినా గోవింద నామ స్మరణతో మారుమ్రోగింది.
Tirumala Rush With Devotees
మొన్న కాస్తంత భక్తులు తగ్గితే నిన్న భారీగా పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 79 వేల 242 మంది దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి నిత్యం సమర్పించే తల నీలాలను 36 వేల 039 మంది సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ 4.76 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
స్వామి వారి దర్శనం కోసం తిరుమల లోని 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 12 గంటలకు పైగా దర్శన భాగ్యం కలగనుందని టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండగా నూతన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Also Read : Liquor Shops Tenders : మవైన్ షాపులకు దరఖాస్తుల వెల్లువ