Sourav Ganguly Row : గంగూలీపై టీఎంసీ..బీజేపీ గొడ‌వ

బీసీసీఐ చీఫ్ ప‌ద‌వి కోల్పోయిన దాదా

Sourav Ganguly Row : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కార్య‌వ‌ర్గం అక్టోబ‌ర్ 18న కొలువు తీర‌నుంది. ఇప్ప‌టికే బీసీసీఐకి ముంద‌స్తుగానే ఎవ‌రు ఉండాల‌నే దానిపై ఒప్పందం చేసుకున్న‌ట్లు ప్ర‌చారం. మొత్తంగా అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌లో ఇప్పుడు అమిత్ షా త‌న‌యుడు జే షా క‌నుస‌న్న‌ల‌లోనే కొన‌సాగ‌నుంది.

రాజీవ్ శుక్లా త‌ప్పా అంతా బీజేపీకి అంత‌ర్గ‌తంగా సపోర్ట్ గా ఉన్న వారేన‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో రెండోసారి కార్య‌ద‌ర్శిగా జే షా ఉండ‌గా లేనిది గంగూలీ ఎందుకు బాస్ గా కొన‌సాగ రాద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా గంగూలీ అంశం రాజ‌కీయ వివాదానికి(Sourav Ganguly Row) తెర తీసింది.

గంగూలీని బీజేపీలో చేర‌మ‌ని అడిగార‌ని కానీ ఒప్పుకోక పోవ‌డంతో అత‌డిని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేసిందంటూ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ ) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశసింది. అయితే తాము ఎప్పుడూ గంగూలీని పార్టీలోకి చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేయ‌లేదని బీజేపీ స్ప‌ష్టం చేసింది.

గంగూలీ గొప్ప క్రికెట‌ర్. ఆయ‌న‌ను మేం సంప్ర‌దించ లేద‌ని పేర్కొన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు దిలీప్ ఘోష్. టీఎంసీ కావాల‌ని రాజ‌కీయం చేస్తోందంటూ ఆరోపించారు. అమిత్ షా కొడుకు ఉండ‌వ‌చ్చు కానీ గంగూలీ ఎందుకు కొన‌సాగ రాదంటూ ప్ర‌శ్నించారు టీఎంసీ నాయ‌కుడు ఎంపీ శాంతాను సేన్.

గంగూలీకి బీసీసీఐ బాస్ గా రెండోసారి చాన్స్ రాక పోవ‌డం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉంద‌ని ఆరోపించారు టీఎంసీ అధికార ప్ర‌తినిధి కునాల్ ఘోష్‌. దేశ వ్యాప్తంగా సౌర‌వ్ గంగూలీ విష‌యం చ‌ర్చ‌నీయాశంగా మారింది.

Also Read : బిన్నీ రాక‌తో బీసీసీఐకి మంచి రోజులు

Leave A Reply

Your Email Id will not be published!