US VISA Process : యుద్ధ ప్రాతిప‌దిక‌న వీసాల జారీ

వెయిటింగ్ పీరియ‌డ్ త‌గ్గింపు

US VISA Process : అమెరికా వీసా కోసం అపాయింట్మెంట్ వెయిటింగ్ పీరియ‌డ్ త‌గ్గించేందుకు య‌త్నిస్తోంది అమెరికా స‌ర్కార్. ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో వీసాలు జారీ చేయాల్సి ఉంది. క‌రోనా త‌గ్గినా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

భార‌త దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ అమెరికా ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ను క‌లిసి చర్చించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో వీసాల జారీ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా చేప‌ట్టాల‌ని కోరారు.

ఇందులో భాగంగా యుఎస్ ప్ర‌భుత్వం కొత్త రూల్స్ ఏర్పాటు చేసింది. బీ1, బీ2 వీసాలు జారీ చేసేందుకు(US VISA Process) య‌త్నిస్తున్న‌ట్లు తెలిపింది. వీసాల జారీ ప్ర‌క్రియ‌లో చోటు చేసుకున్న జాప్యాన్ని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం వీసా కావాలంటే 500 రోజుల‌కు పైగా నిరీక్షించాల్సి వ‌స్తోంది. మీకు యుఎస్ వెళ్లాల‌ని అనుకుంటే మీరు మీ గ‌మ్య స్థానంలో ఉన్న యుఎస్ ఎంబ‌సీ లేదా కాన్సులేట్ లో వీసా అపాయింట్ మెంట్ పొంద‌చ్చ‌ని తెలిపింది యుఎస్ ఎంబ‌సీ వెల్ల‌డించింది.

బ్యాక్ లాగ్ ను త‌గ్గించేందుకు ఢిల్లీ, కోల్ క‌తా, చెన్నై , హైద‌రాబాద్ కాన్సులేట్ ల‌లో అద‌న‌పు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన‌ట్లు అమెరికా తెలిపింది. యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ మునుప‌టి వీసాల‌తో ఉన్న ద‌ర‌ఖాస్తుదారుల కోసం ఇంట‌ర్వ్యూ మిన‌హాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్ ను కూడా అమ‌లు చేసింది. భార‌త దేశంలోని యుఎస్ మిష‌న్ రెండు వారాల కింద‌ట 2,50,000 అద‌న‌పు బీ1, బీ2 అపాయింట్ మెంట్ల ను విడుద‌ల చేసింది.

Also Read : చైనాకు షాక్ యాప్స్ పై నిషేధం

Leave A Reply

Your Email Id will not be published!