Satyendar Jain : మంత్రి సత్యేంద్ర జైన్ కు కోర్టు షాక్
కోర్టులో ఎదురు దెబ్బ జూన్ 9 వరకు కస్టడీ
Satyendar Jain : మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఆప్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్(Satyandra Jain) కు కోలుకోలేని షాక్ తగిలింది. అరెస్ట్ చేసిన ఆయనను ఈడీ కోర్టులో హాజరు పర్చింది.
2015-16 లో కోల్ కతాకు చెందిన ఒక సంస్థతో హవాలా లావాదేవీలకు పాల్పడ్డారంటూ ఆరోపించింది. జూన్ 9 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం లో ఉన్న మంత్రి ఆయా సంస్థల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆర్థిక నేరాలపై దర్యాప్తు సంస్థ ఆరోపించింది. కాగా కస్టడీ కాలంలో జైనుల ఆహారం కోసం ఢిల్లీ మంత్రి చేసిన అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందించింది.
కాగా ప్రతి రోజూ జైన దేవాలయాన్ని సందర్శించాలని సత్యేంద్ర జైన్(Satyandra Jain) చేసిన విన్నపాన్ని సున్నితంగా కోర్టు తిరస్కరించింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈడీ తరపున వాదించారు.
సత్యేంద్ర జైన్ 2015-17 మధ్య కాలంలో రూ. 1.67 కోట్ల మేరకు అసమాన ఆస్తులు సంపాదించారని వెల్లడించారు కోర్టులో. మంత్రి తను అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని హవాలా ఆపరేటర్ల ద్వారా బదిలీ చేసి కోల్ కతాకు చెందిన షెల్ కంపెనీల ద్వారా లాండరింగ్ చేశారని ఆరోపించారు.
ఇదే సమయంలో ఆ డబ్బుల్ని ఢిల్లీలో భూమి కొనుగోలు చేసేందుకు ఉపయోగించారని ఈడీ పేర్కొంది. దర్యాప్తులో షెల్ కంపెనీలు కోల్ కతా లోని ఇద్దరు నివాసితులు నియంత్రించారని తెలిపింది.
వారు రూ. 100కి 15-20 పైసల కమీషన్ తో ఎంట్రీలు ఇస్తున్నట్లు అంగీకరించారు. మొదట మంత్రిని అరెస్ట్ చేయలేదని, విచారణకు పిలిచామని దర్యాప్తు సంస్థ తెలిపింది.
కానీ ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశాడని ఆరోపించింది ఈడీ. కేవలం షేర్ హోల్డింగ్ మాత్రమే కాదు అతనికి నియంత్రణ వాటా కూడా ఉందని తెలిపింది.
Also Read : రాజ్యసభ బరిలో జీ సుభాష్ చంద్ర