73rd Indian Republic Day : మేరా భారత్ మహాన్
వీరులకు వందనం
73rd Indian Republic Day : సమున్నత భారతావని సగర్వంగా తల ఎత్తుకునే శుభదినం జనవరి 26. భారత దేశం సర్వ సత్తాక రాజ్యాంగానికి ఆమోదం తెలిపిన రోజు. ఇవాళ అత్యంత ప్రత్యేకత కలిగిన రోజు.
ఒక రకంగా మనందరికీ పండగ రోజు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో సర్వ సత్తాక భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
వేలాది మంది బలిదానాలు, ఆత్మ త్యాగాల సాక్షిగా ఏర్పడిన దేశానికి రక్షణ కవచంగా ఉండేలా రాజ్యాంగం ఏర్పాటైంది.
ఏ దేశానికైనా పాలనా పరంగా ఉండాల్సింది రాజ్యాంగం. ఎంతో కష్టపడి ఎందరో అహోరాత్రులు శ్రమించి మన రాజ్యాంగాన్ని(73rd Indian Republic Day )రాశారు.
ఆంగ్లేయుల దాష్టీకాలకు ఎందరో తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు.
మరికొందరు ఉరి కొయ్యలను ముద్దాడారు. ఇంకొందరు శత్రువులపై దాడికి పాల్పడ్డారు. ఆనాటి నుంచి నేటి దాకా సైనికులు అలుపెరుగని రీతిలో దేశం కోసం విశిష్ట సేవలు అందిస్తున్నారు.
తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. సమస్త భారత జాతి సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారు.
నిబద్దతతో విధులు నిర్వహిస్తూ దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తూ భరత మాత ముద్దు బిడ్డలుగా తమను తాము నిరూపించుకుంటున్నారు.
విశిష్ట సేవలు అందిస్తూ దేశం కంటే ప్రాణం గొప్పది కాదని చాటి చెప్పేందుకు సైతం వెనుకాడడం లేదు. నా జీవితం కంటే నా దేశం గొప్పదని ప్రకటించిన వీరులు ఎందరో ఈ మట్టిపైన జన్మించారు.
వేలాది మంది తమ విలువైన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు. ఈ దేశం వీరులను కన్నది. పోరాట యోధులను తయారు చేసింది.
కోట్లాది భారతీయుల గుండె చప్పుళ్లను వినిపిస్తోంది మేరా భారత్ మహాన్ అంటూ నినదిస్తోంది. రెప రెప లాడే మువ్వొన్నెల భారత జాతీయ పతాకానికి సలాం చేస్తోంది దేశం.
దేశం కోసం విశిష్ట సేవలు అందిస్తున్న వారిని స్మరించు కోవడం వారిని గుర్తు పెట్టుకుని పురస్కారాలతో, అవార్డులతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ దేశానికి దిశా నిర్దేశం చేస్తూ భావి భారత పౌరులుగా తయారు చేసే ఈ జాతి ప్రతి ఒక్కరిని (73rd Indian Republic Day )ఆదర్శ ప్రాయంగా తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగానే వీరులకు సలాం చేస్తోంది. వారి సేవలను గుర్తు చేసుకుంటోంది.
Also Read : మరాఠా ధీరవనిత రమాబాయి రనడే