Tom Moody : తీరు మార‌ని ముంబై ఇండియ‌న్స్

మాజీ కోచ్ టామ్ మూడీ కామెంట్స్

Tom Moody : ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు టైటిల్ గెలిచిన జ‌ట్టుగా పేరొందిన ముంబై ఇండియ‌న్స్ త‌న ఆట తీరు మార్చు కోవ‌డం లేదు. గ‌త ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లో నిరాశ ప‌రిచింది. తీరా ఈసారైనా మెరుపులు మెరిపిస్తుంద‌ని అనుకుంటే సేమ్ సీన్ రిపీట్ చేస్తోంది. దీంతో ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్ తెగ ఇబ్బంది ప‌డుతున్నారు.

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం ఈ జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా ఉన్నాడు. ఈసారి జ‌రిగిన ఐపీఎల్ వేలం పాట‌లో సైతం కొత్త ఆట‌గాళ్ల‌ను తీసుకుంది. కానీ ఆట తీరులో ఏ మాత్రం స్పెషాలిటీ క‌నిపించ‌డం లేదు.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు ప్ర‌త్యేకంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ. ఇలాగే ఆడుతూ పోతే ఫైన‌ల్ కు కూడా చేరుకుంటుందా అన్న అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌న్నారు. లీగ్ లో భాగంగా తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో 8 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. గ‌త ఏడాది క‌న‌బ‌ర్చిన ప్ర‌ద‌ర్శ‌నే ఇప్పుడు క‌న‌బరుస్తుండ‌డం విస్తు పోయేలా చేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు 15 సీజ‌న్లు జ‌రిగితే అందులో 5 సార్లు విజేత‌గా నిలిచిన జ‌ట్టు ఇదేనా అని ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుత జ‌ట్టులో చాలా లోపాలు ఉన్నాయ‌ని పేర్కొన్నాడు టామ్ మూడీ(Tom Moody).  ఏ మాత్రం టీమ్ స్పిరిట్ క‌నిపించ‌డం లేదంటూ బాంబు పేల్చాడు.

Also Read : బీజేపీ బీఆర్ఎస్ నాట‌కం – భ‌ట్టి

Leave A Reply

Your Email Id will not be published!