TOP 10 Media Houses : టాప్ 10 మీడియా హౌస్ లు ఇవే
టాప్ వన్ లో జీ మీడియా హౌస్
TOP 10 Media Houses : ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియ చేసే మీడియా హౌస్ లలో భారత దేశానికి సంబంధించి ఈ ఏడాదిలో 10 టాప్ లో నిలిచాయి. వాటిలో నెంబర్ వన్ మీడియా హౌస్ గా సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ గ్రూప్ నిలిచింది. 12 భాషల్లో 24 గంటల పాటు ప్రసారం చేస్తోంది.
రాజకీయాలు, వినోదం, క్రీడలు , జీవన శైలి తో పాటు ఎన్నో వార్తలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. మే 26, 1992లో దీనిని ఏర్పాటు చేశారు సుభాష్ చంద్ర. దేశంలో అత్యంత ఆరాధించే సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది.
2వ ప్లేస్ లో స్టార్ గ్రూప్ కు చెందిన ఏబీపీ న్యూస్ . ఆనంద్ బజార్ పత్రిక కూడా దీనికి సంబంధించిందే. అతి పెద్ద ప్రైవేట్ న్యూస్ నెట్ వర్క్ కలిగి ఉంది. దేశంలోని డిజిటల్ మీడియా హౌస్ లలో ఇది ఒకటిగా పేరు పొందింది.
అక్టోబర్ 27, 2003లో దీనిని స్టార్ట్ చేశారు. నోయిడాలో దీని కార్యాలయం ఉంది. కంటెంట్, వినోదం, వార్తలను అందిస్తుంది. 1998లో ఫ్రీ టు ఎయిర్ టెలివిజన్ స్టేషన్ గా మారింది. దీనికి ముందు పేరు స్టార్ న్యూస్. 3వ స్థానంలో నిలిచింది ఆజ్ తక్ – సబ్సే తేజ్.
న్యూఢిల్లీ ప్రధాన ఆఫీసుతో లివింగ్ మీడియా కంపెనీ తీసుకుంది. టీవీ టుడే నెట్ వర్క్ హిందీ భాషా వార్తా ఛానల్ నడుపుతోంది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూయర్ , సబ్ స్క్రైబ్స్ ను కలిగి ఉంది.
దీనికి సంబంధించి ఐదు వెబ్ సైట్స్ ను నిర్వహిస్తోంది. ఆజ్ తక్ యుఎస్ఏ కూడా మోస్ట్ పాపులర్ . ఇండియా టుడే 4వ స్థానంలో నిలిచింది.
వాస్తవాలు, సమాచారాన్ని నిష్పక్షపాతంగా అందజేయాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు టాప్ ప్రచురణ కంపెనీలలో ఒకటిగా పేరొందింది. 1975 నుంచి అద్భుతమైన వార్తలు, క్రీడలు, వినోదాన్ని పంచుతోంది.
హిందీ వార్తా ఛానెల్ , ఇండియా టుడే భారతీయ మార్కెట్ లో టాప్ లో ఉంది. ఇది టెలివిజన్ ఛానెల్స్ , వెబ్ సైట్స్ , మ్యాగజైన్ లు, యాప్ ల ద్వారా రిచ్ కంటెంట్ ను అందిస్తోంది.
5వ స్థానంలో నిలిచింది ఎన్డీటీవీ. ఈ ఏడాదిలో టాప్ లో నిలిచింది సంస్థ. 1988లో కేవలం రెండు గంటల ప్రోగ్రామింగ్ తో పరిచయం చేశారు. దేశంలోని అగ్రగామి మీడియా సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది.
2016లో ఎన్డీటీవీ స్పైస్ పేరుతో యుకెల్ కూడా స్టార్ట్ చేశారు. కాగా దీనిని గౌతమ్ అదానీ టేకోవర్ చేసుకున్నారు. ప్రణయ్ రాయ్ తప్పుకున్నారు. ఏప్రిల్ 15, 2003లో 24 గంటల వార్తా ఛానెల్ ప్రారంభించారు.
సీఎన్ఎన్ – న్యూస్ 18 6వ స్థానంలో నిలిచింది. ఇండియాలో అతి పెద్ద మీడియా సంస్థ. అమెరికాకు చెందిన సీఎన్ఎన్ సపోర్ట్ తో ఇండియాలో రాఘవ్ బహ్ల్ స్థాపించారు.
మే 2014లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నెట్ వర్క్ 18ని కొనుగోలు చేసింది. భారతీయ మీడియా రంగంలో ఎన్నడూ లేని రీతిలో అతి పెద్ద డీల్ గా కూడా పేర్కొంటారు. 7వ స్థానంలో చోటు దక్కించుకుంది ఇండియా టీవీ. దీనిని 2003లో స్టార్ట్ చేశారు.
ఇతర దేశాలలో కూడా ఉంది. ప్రధాన ఆఫీసు నోయిడాలో ఉంది. 1997లో ఐఎన్ఎస్ ని ప్రారంభించారు. రజత్ శ్మ 2004లో దీనిని స్థాపించారు. స్టార్ న్యూస్ లో జనతా కీ అదాలత్ నిర్వహించాడు. అంతకు ముందు జీ న్యూస్ లో కూడా నిర్వహించిన ప్రోగ్రామ్ చేపట్టాడు.
బీబీసీ వరల్డ్ న్యూస్ హిందీ, ఇంగ్లీష్ 8వ ప్లేస్ లో నిలిచింది. సీఎన్ఎన్, సీఎన్ బీసీ తో పాటు ఇంటర్నేషనల్ వార్తలను అందిస్తోంది. దేశంలోని వివిధ భాషల్లో వార్తల్ని అందిస్తోంది.
ప్రపంచంలో అత్యంత నమ్మకమైన, జనాదరణ కలిగిన వార్తా సంస్థగా పేరు పొందింది బీబీసీ. లండన్ లో ఆఫీసు ఉంది. ఇటీవల తెలుగులో కూడా స్టార్ట్ చేశారు. గ్లోబల్ టెలివిజన్ సర్వీసెస్ గా అక్టోబర్ 22, 1995లో స్టార్ట్ చేశారు. బీబీసీ రేడియో కూడా ఉంది.
9వ స్థానంలో నిలిచింది టైమ్స్ నౌ 24 గంటల ఛానల్. దేశంలో మోస్ట్ పాపులర్ టీవీగా పేరొందింది. ప్రపంచంలోని పలు పేరొందిన నగరాలలో కూడా దీనిని ఏర్పాటు చేశారు.
గతంలో దీనికి అర్నాగ్ గోస్వామి ఉండేవారు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు కూడా పొందిన ఏకైక ఛానెల్. 10వ స్థానంలో డీడీ న్యూస్ .
ఇండియాలో టాప్ న్యూస్ అందించే వాటిలో ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ న్యూస్ పేరొందింది. దీనిని 2003లో ఏర్పాటు చేశారు. మే 7, 2015న మొబైల్ యాప్ ను కూడా విడుదల చేశారు.
అత్యంత లాభ దాయకమైన మీడియా కంపెనీలలో ఒకటిగా పేరు పొందింది. 11వ స్థానంలో నిలిచింది అర్నాబ్ గోస్వామి ప్రారంభించిన రిపబ్లిక్ టీవీ. ప్రారంభించిన కొద్ది కాలంలోనే టాప్ లోకి చేరింది. మోస్ట్ పాపులర్ టీవీ షోస్ గా దీనికి పేరుంది.
Also Read : నటుడు చలపతిరావు కన్నుమూత