Top Awards FIFA 2022 : ఫిఫా వరల్డ్ కప్ లో అవార్డులు విజేతలు
మార్టినేజ్..మెస్సీ..మబాప్పే కు పురస్కారాలు
Top Awards FIFA 2022 : ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ముగిసింది. నెల రోజులకు పైగా సాగిన సాకర్ సంబురం ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫ్రాన్స్ ను 4-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.
1930 నుంచి జరుగుతూ వస్తున్న ఫుట్ బాల్ వరల్డ్ కప్ చరిత్రలో మూడు సార్లు అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఇక మెస్సీకి ఇదే ఆఖరి టోర్నీ. ఇక నుంచి తాను ఫుట్ బాల్ ఆడలేనంటూ ప్రకటించాడు. కోట్లాది మందిని విస్తు పోయేలా చేశాడు.
ఇదిలా ఉండగా ఫిఫా వరల్డ్ కప్ లో ఎందరో ఆటగాళ్లు మెరిశారు. టైటిల్ ఫెవరేట్స్ గా ఉన్న జట్లన్నీ ఇంటి బాట పట్టాయి. ఇక ఫిఫా చరిత్రలో అరుదైన ఘనతను స్వంతం చేసుకుంది. ఆఫ్రికా ఖండానికి చెందిన ఖతార్ సెమీ ఫైనల్ కు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా పీలే ఆనందం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో మెస్సీ అసలైన విజేత అంటూ కితాబు ఇచ్చాడు.
ఇదిలా ఉండగా ఫిఫా వరల్డ్ కప్ 2022లో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లకు అత్యుత్తమ అవార్డులు(Top Awards FIFA 2022) దక్కాయి. వారిలో అర్జెంటీనా స్కిప్పర్ మెస్సీతో పాటు గోల్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్ , ఫ్రాన్స్ స్ట్రైకర్ మెబాప్పే కు దక్కాయి. ఫైనల్ లో 1966 తర్వాత హ్యాట్రిక్ సాధించడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఇక గోల్డెన్ గోవ్ అవార్డును మార్టినెజ్ ను వరించింది.
ఇక కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది. ఇక గోల్డెన్ బూట్ ను గెలుచుకున్నాడు మెబాప్పే.
Also Read : ఇది అర్జెంటీనా ప్రజల విజయం – మెస్సీ